మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్

డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు ఉవ్వెత్తున కొనసాగుతున్నాయి. టీజర్లు, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే యూఎస్‌లో విష్ణు మంచు స్టార్ట్ చేసిన కన్నప్ప ప్రమోషనల్ టూర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కన్నప్ప కథను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కామిక్ బుక్స్ రూపంలోకి విష్ణు మంచు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.
కామిక్ సిరీస్‌లోని మొదటి రెండు ఎపిసోడ్లకు అఖండ స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడో అధ్యాయాన్ని విడుదల చేశారు. ఈ చివరి ఎపిసోడ్ తిన్నడు భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను సూచిస్తుంది. అతను ఒకప్పుడు దైవత్వం ఆలోచనను తిరస్కరిస్తాడు.. కానీ చివరికి శివుని భక్తుడిగా మారుతాడు. కన్నప్పగా మారడానికి అతని అద్భుతమైన ప్రయాణాన్ని ఈ మూడో అధ్యాయం వివరిస్తుంది. భక్తి, ప్రేమ, త్యాగం, విధితో నిండిన ఈ కథ అందరినీ ఆకట్టుకుంటుంది.

News by : V.L
Manchu Vishnu's dream project Kannappa.. Comic book final chapter concept video release
