కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్.. సొంతవాళ్లే దూరం పెట్టే ఈ రోజుల్లో అంటూ ఎమోషనల్

మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న కొత్త సినిమా ‘భైరవం’. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా.. కేకే రాధామోహన్ నిర్మించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం, తమిళ సూపర్‌హిట్ ‘గరుడన్’కు రీమేక్‌గా రూపొందింది. ఇందులో ఆదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై, శరత్ లోహితాశ్వ, అజయ్, సందీప్ రాజ్ వంటి నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దమైన ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏలూరులో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మనోజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఈవెంట్లో మనోజ్ జీవన ప్రయాణం ఆధారంగా రూపొందించిన ఓ స్పెషల్ వీడియో (AV) ప్రదర్శించగా, అది చూసిన ఆయన కంటతడి పెట్టుకున్నారు. గతంలో ఎదురైన ఆస్తి తగాదాలు, పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరిగిన పరిస్థితులు అన్నీ ఇందులో చూపించడంతో మనోజ్ ఎమోషన్ అయిపోయారు.

News by : V.L
