

కుక్కపిల్ల
అగ్గిపుల్ల
సబ్బుబిళ్ళ
అర్హమైనవే కవితలల్ల యని నుడివి
వాడుక భాషలో కవితలల్లి
సామాన్యుని ఇంటిముంగిట
సాహితిరంగవల్లులు దిద్దిన
మహాకవి శ్రీశ్రీ!
కష్టజీవులకు ఇరువైపులా ఉండేవాడే కవియని
కార్మిక కర్షక, శ్రామికుల కడగండ్లను కడతీర్చేందుకు
ఉద్యమించిన అభ్యుదయ భావ కవి శ్రీశ్రీ!
భూస్వాముల ఆగడాను ఎదిరించి
కష్టజీవులకు అండగా నిల్చి
తాడిత పీడిత జనావాళికి కి వెన్నుదన్నై నిల్చిన
ధీ శాలి మహాకవి శ్రీశ్రీ!
పోరాడితే పోయేదేమి లేదు. బానిస సంకెళ్ళు తప్ప అంటూ
పదండి ముందుకు
పదండి త్రోసుకు
ఆకలి చావులు లేని
ఆర్ధిక అసమానతలు ఎరుగని
కుల మత రహిత మరో ప్రపంచం పిలుస్తుంది
రండి…. రారండీ…. అంటూ
ఇచ్చిన శ్రీశ్రీ పిలుపు
చైతన్య రహిత సమాజాన్ని మేల్కొల్పింది
సమ సమాజ నిర్మాణానికి పురిగొల్పింది
నవ యువతకు స్ఫూర్తిదాయకమై నిల్చింది!

News by : VL
