మెగా హీరోతో మారుతి సినిమా!

పండగ సినిమాల హడావుడిలో జనం అంతగా పట్టించుకోలేదు కానీ ప్రభాస్- మారుతి రాజాసాబ్ కూడా అంతో ఇంతో షేర్ లాగుతూనే వుంది. ఏ మేరకు నష్టం.. బయ్యర్లకు, నిర్మాతకు అన్న లెక్కలు తేలడానికి మరో రెండు వారాలు పడుతుంది.

ఇక అదంతా వేరే సంగతి. ఈ సినిమా తరువాత ప్రభాస్ సినిమాలు ఏమిటి అన్నది చెప్పక్కరలేదు. బోలెడు వున్నాయి. మరి దర్శకుడు మారుతి ఏ సినిమా చేయబోతున్నారు అన్నది పాయింట్.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం దర్శకుడు మారుతి ఒక మెగా హీరోతో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. మారుతి కి అత్యంత సన్నిహితుడైన నిర్మాత ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వీలయినంత రీజనబుల్ బడ్జెట్ లో సినిమా నిర్మించేందుకు వీలుగా మంచి కథ ను రెడీ చేయాల్సి వుంది. వన్స్ కథ రెడీ అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది.

అయితే దీనికి ఇంకా టైమ్ వుంది. ఎందుకంటే హీరోగా చేసే మెగా హీరో చేతిలో ప్రస్తుతం వున్న ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. ఆ తరువాత మరి ఈ ప్రాజెక్ట్ మీదకు వస్తారో, లేదా మరో సినిమా చేసిన తరువాత వస్తారో చూడాలి.

ప్రస్తుతానికి దర్శకుడు మారుతి తన దగ్గర వున్న స్క్రిప్ట్ లకు పదును పెట్టే పనిలో వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top