LPG Cylinder: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ల కోసం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే?..

LPG Cylinder Price: వంటింట్లో గ్యాస్ వాడుతున్న వారికి ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మీ పై భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.LPG Cylinder Price: వంటింట్లో గ్యాస్ వాడుతున్న వారికి ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మీ పై భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దీపం 2’ పథకాన్ని మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఇకపై లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయనుంది. ఈ కొత్త విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.ప్రస్తుతం గుంటూరు, ఎన్టీఆర్ వంటి ఎంపిక చేసిన జిల్లాల్లో మాత్రమే ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు సమాచారం. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే రాయితీ డబ్బులు వారి డిజిటల్ వాలెట్‌లో జమ అవుతాయి. ఆ డబ్బులనే గ్యాస్ ఏజెన్సీకి చెల్లించవచ్చు. ఫలితాలు అనుకూలంగా వస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు విధానం ప్రకారం, లబ్ధిదారులు ముందుగా సిలిండర్‌కు పూర్తి మొత్తాన్ని చెల్లించి, తరువాత ప్రభుత్వ రాయితీ వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నది. అయితే, దీనిలో జాప్యం వల్ల లబ్ధిదారులకు అసౌకర్యం కలుగుతోందని పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీపం పథకం వివరాలు ఇలా ఉన్నాయి: ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. మొదటి విడతలో 846 కోట్ల రూపాయలతో 97 లక్షల మందికి, రెండో విడతలో 712 కోట్ల రూపాయలతో 91.10 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించినట్లు సమాచారం. ఈ పథకం పట్ల ప్రభుత్వం ప్రతిష్టాత్మక దృక్పథంతో ఉన్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీలతో సమన్వయం ద్వారా దీన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఇది మిక్కిలి ఉపశమనం కలిగిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఇకపై గ్యాస్ బుక్ చేస్తే చాలు – ముందస్తు చెల్లింపులు అవసరం లేదు. డబ్బులు నేరుగా వారి డిజిటల్ వాలెట్‌కి వస్తాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ మార్పుతో పథకం మరింత వేగవంతంగా, ప్రభావవంతంగా అమలవుతుందని విశ్వసిస్తున్నారు.

