Lord Ram and Shiva: రాముడు, శివుడు ఇండియాలో పుట్టలేదా? నేపాల్ ఎందుకిలా అంటోంది? కుట్ర కోణం ఉందా?

Lord Ram and Shiva: మన చరిత్ర, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ రాముడు, శివుడి గురించి చాలా విషయాలు చెబుతున్నాయి. ఐతే.. కొత్తగా నేపాల్ ప్రభుత్వం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. కొత్త చిచ్చును తెరపైకి తెచ్చింది. మరి దీని వెనక ఎవరున్నారు? నేపాల్‌ని తోలు బొమ్మలా అడిస్తున్నదెవరు? నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు, శివుడు, విశ్వామిత్రుడు నేపాల్‌లో జన్మించారని అన్నారు. ఈ వ్యాఖ్యలు భారత్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజధాని ఖాట్మండులో జరిగిన ఓ కార్యక్రమంలో ఓలి పాల్గాన్నారు. రాముడు నేపాల్‌లోని తోరీ ప్రాంతంలో జన్మించాడనీ, భారత్‌లోని అయోధ్యలో కాదని వాదించారు. వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలతో ముడిపడి ఉండటంతో భారత్‌లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓలి తన వాదనకు వాల్మీకి రామాయణమే ఆధారం అంటున్నారు. రాముడు కోసీ నదిని దాటి పశ్చిమానికి వెళ్లాడనీ, విశ్వామిత్రుడు సునసరీ జిల్లాలోని చతారా నుంచి వచ్చాడని వాల్మీకి రామాయణంలో ఉందని ఆయన అంటున్నారు. అలాగే వాల్మీకి ఆశ్రమం, దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన రిడి ప్రాంతం నేపాల్‌లోనే ఉన్నాయని ఆయన వాదిస్తున్నారు. అందువల్ల రాముడు నేపాలీ అని ఆయన చెబుతున్నారు. అసలైన అయోధ్య.. నేపాల్‌లోని బీర్గంజ్ దగ్గర్లోని తోరీలో ఉందనీ, భారత్‌లో చెబుతున్న అయోధ్య నకిలీది అని ఆయన ఆరోపించారు. ఓలి వ్యాఖ్యలపై భారత్‌లోని హిందూ సంస్థలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. శివసేన వంటి పార్టీలు ఓలిని చైనా పావుగా అభివర్ణించాయి. పురాణాల ప్రకారం, సరయూ నది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య దగ్గర్లో ప్రవహిస్తుందనీ, నేపాల్‌లో అలాంటి నది లేదని వారు వాదించారు. ఓలి వ్యాఖ్యలు భారత్-నేపాల్ సాంస్కృతిక సంబంధాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు భారత కేంద్ర ప్రభుత్వం నుంచి ఓలి వ్యాఖ్యలపై అధికారిక స్పందన ఏదీ రాలేదు. 2020లో కూడా ఓలి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో భారత కేంద్ర ప్రభుత్వం.. నేపాల్‌కి దౌత్యపరమైన నోట్‌ని పంపింది. తద్వారా అప్పట్లో ఈ వివాదం పెద్దగా దుమారం రేపలేదు. ఈసారి కూడా దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. భారత్, నేపాల్ మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధం బలంగా ఉన్నందున, ఈ వివాదం దీర్ఘకాలిక ప్రభావం చూపకపోవచ్చని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు భారత కేంద్ర ప్రభుత్వం నుంచి ఓలి వ్యాఖ్యలపై అధికారిక స్పందన ఏదీ రాలేదు. 2020లో కూడా ఓలి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో భారత కేంద్ర ప్రభుత్వం.. నేపాల్‌కి దౌత్యపరమైన నోట్‌ని పంపింది. తద్వారా అప్పట్లో ఈ వివాదం పెద్దగా దుమారం రేపలేదు. ఈసారి కూడా దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. భారత్, నేపాల్ మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధం బలంగా ఉన్నందున, ఈ వివాదం దీర్ఘకాలిక ప్రభావం చూపకపోవచ్చని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

