Lokesh, who was booked with a laborer, is everyone’s target.

అసలేంటి మ్యాటర్ చూద్దామా..? లోకేష్ కనకరాజ్ కెరీర్ అంటే కూలీకి ముందు.. తర్వాత అని చెప్పాలేమో..? ఒక్క సినిమాతో ఈయన క్రేజ్ చాలా వరకు డ్రాప్ అయింది. రజినీకాంత్ లాంటి స్టార్ సినిమాలో ఉంటే.. కనీసం కథపై కాన్సట్రేట్ చేయకుండా ఏదో అలా చుట్టేసాడు అనే విమర్శలు లోకేష్‌పై బాగా గట్టిగా ఉన్నాయి. ముఖ్యంగా నాగార్జున విషయంలో ఫ్యాన్స్ డీప్‌గా హర్ట్ అయ్యారు. నాగార్జున గురించి ఎంతో బిల్డప్ ఇచ్చి.. చివరికి ఆ క్యారెక్టర్ నార్మల్ విలన్ పాత్రలాగే డిజైన్ చేసారనే విమర్శలు గట్టిగా వచ్చాయి. లోకేష్ టేకింగ్‌పై రిలీజ్ తర్వాత నాగ్ కూడా ఫీల్ అయ్యారని తెలుస్తుంది.. అందుకే ఇకపై ఈ నెగిటివ్ రోల్స్ మనకు సెట్ అవ్వవంటున్నారు మన్మథుడు. మరోవైపు అమీర్ ఖాన్ సైతం కూలీలో నటించి తప్పు చేసానని ఓపెన్‌గానే చెప్పారు. కూలీలో నటించడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అన్నారు అమీర్.. లోకేష్ కనకరాజ్‌పై ఇంతకంటే దారుణమైన కామెంట్ మరోటి ఉండదేమో..? తాజాగా రెబా మోనిక జాన్ సైతం కూలీలో తన పాత్రను లోకేష్ డిజైన్ చేసిన తీరుపై తప్పుబట్టింది. తనకు చెప్పిందొకటి.. అక్కడ ఉన్నదొకటి అంటున్నారు రెబా. ఇందులో శృతి చెల్లిగా నటించారు ఈ బ్యూటీ. మొత్తానికి కూలీ లోకేష్ ఇమేజ్ బాగా డ్యామేజ్ చేసింది.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *