Lokesh Good News from Australia..! Antidote to Trump Shock..!

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. ఓవైపు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణతో పాటు మరోవైపు భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా లోకేష్ దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా నుంచి లోకేష్ ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీంతో కొంతకాలంగా మన వ్యాపారులు ఎదుర్కొంటున్న ఓ సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది.

ఆస్ట్రేలియా గతంలో మన రొయ్యల దిగుమతుల్ని నిషేధించింది. దీనికి కారణం వాటిలో వైట్ స్పాట్ వైరస్ ఆనవాళ్లు లభించడమే. దీంతో ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతులు జరగడం లేదు. మరోవైపు తాజాగా ట్రంప్ విధించిన 50 శాతం పన్నుల దెబ్బకు ఆ దేశానికి సైతం మన రొయ్యల ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో అక్వా రంగంపై ఆధారపడిన మన వ్యాపారాలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా అధికారులతో చర్చలు జరిపిన లోకేష్.. ఈ మేరకు రొయ్యల దిగుమతులకు ఒప్పించినట్లు తెలుస్తోంది.

ఈరోజు భారతీయ రొయ్యల దిగుమతికి మొదటి ఆమోదం లభించిందని లోకేష్ ట్వీట్ చేశరాు. దీనిని సాధ్యం చేయడానికి భారత ,, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు చేసిన విస్తృత కృషికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఒకే మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడకుండా మనల్ని మనం ప్రమాదం నుండి తప్పించుకోవడానికి కొత్త మార్కెట్‌లను తెరవడం కొనసాగించాలని లోకేష్ తన ట్వీట్ లో సూచించారు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *