Liver Health: రోజూ పొద్దున్నే ఈ పండ్లు తింటే.. లివర్ ప్రాబ్లమ్స్ రమ్మన్నా రావు!

ఖరీదైన మందులు అవసరం లేకుండా చాలా సింపుల్ చిట్కాలతో కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడం మన చేతుల్లోనే ఉందని చాలా మందికి తెలియదు. ఆ చిట్కా మరేంటో కాదు.. రోజూ పండ్లు తినడమే.కాలేయం శరీరంలో చాలా కీలకమైన పనులు చేస్తుంది. మనం తినే ఫుడ్ నుంచి పోషకాలను వేరు చేయడం, బాడీ నుంచి టాక్సిన్స్ బయటకు పంపడం, డైజేషన్‌కు అవసరమైన బైల్ జ్యూస్‌ను ఉత్పత్తి చేయడం వంటి ఎన్నో పనులను చేస్తుంది. అందుకే అది హెల్తీగా (Liver Health) ఉండడం చాలా ముఖ్యం.కానీ, మోడ్రన్ లైఫ్‌స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా మందికి లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే, ఖరీదైన మందులు అవసరం లేకుండా చాలా సింపుల్ చిట్కాలతో కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడం మన చేతుల్లోనే ఉందని చాలా మందికి తెలియదు. ఆ చిట్కా మరేంటో కాదు.. రోజూ పండ్లు తినడమే. మరి ఏం పండ్లు తినాలి? అవి లివర్‌కు ఎలా హెల్ప్ చేస్తాయో చూద్దాం.సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లలో విటమిన్ C ఉంటుంది. ఇది కాలేయ పనితీరును ఇంప్రూవ్ చేస్తుంది. ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకొని తాగితే బైల్ జ్యూస్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కాలేయం చేసే డిటాక్స్ (Liver Detox) ప్రాసెస్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయ కణాల రక్షణ, ఇన్ఫ్లమేషన్ను తగ్గించడం, నాల్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌లో కొవ్వును కరిగించడం వంటి పనులు చేస్తాయి.యాపిల్
రోజుకు ఒక యాపిల్ తింటే, డాక్టర్‌ను కలవాల్సిన అవసరం రాదు. దాంట్లో ఉండే పెక్టిన్ అనే కరిగే ఫైబర్ లివర్ హెల్త్‌కు (Liver Health) చాలా మంచిది. ఇది టాక్సిన్స్‌ను బంధించి శరీరం వాటిని పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. అందుకే రోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు యాపిల్స్ తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ పండ్లలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని క్లీన్ చేసి కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి.అవకాడో
అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, గ్లూటాథియోన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్లకు ఇది చాలా మంచిది. గ్లూటాథియోన్ లివర్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.బొప్పాయి
బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను బ్రేక్ చేసి కాలేయంపై భారాన్ని తగ్గిస్తాయి. ఇందులో విటమిన్-సి, ఫ్లేవనాయిడ్లు.. ఫ్యాటీ లివర్‌తో పోరాడతాయి.
