Liver Damage: లివర్ డ్యామేజ్ అయిందని చెప్పే 5 సంకేతాలు.. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే జాగ్రత్త.. లైట్ తీసుకుంటే ప్రాణాలు పోవచ్చు!

లివర్ ప్రాబ్లమ్స్‌ను కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. వీటిని గమనించి, వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. అవేంటో చూద్దాం. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కాలేయ వ్యాధులు (Liver Disease) ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. హెపటైటిస్, సిర్రోసిస్‌తో పాటు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వంటి కేసులు క్రమంగా ఎక్కువవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. లైఫ్‌స్టైల్ మార్పులు వ్యాధికి కారకాలైతే, ఆలస్యంగా వ్యాధిని గుర్తించడం మరణానికి దారితీస్తోంది. పైగా, కాలేయ వ్యాధులు సైలెంట్‌గా లోలోపలే వృద్ధి చెంది వ్యాధి తీవ్రమయ్యే వరకు బయటకు లక్షణాలు కనిపించవు. అయితే లివర్ ప్రాబ్లమ్స్‌ను కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. వీటిని గమనించి, వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. అవేంటో చూద్దాం. కామెర్లు
కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడాన్ని కామెర్లు (Jaundice)గా సూచిస్తుంటాం. కాలేయం పనిచేయకపోవడానికి ఇదొక ముఖ్యమైన సంకేతం. ఎర్ర రక్త కణాల నుంచి వచ్చే బిలిరుబిన్ అనే వ్యర్థాన్ని కాలేయం ప్రాసెస్ చేయకపోతే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు మిగతా కారకాలు కూడా జాండీస్‌కి కారణమౌతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తీవ్రమయ్యే లోపు వైద్యుడిని సంప్రదించడం బెటర్.
మలం రంగు మారడం
మలం (Stool).. ముదురు నలుపు లేదా తారు రంగులో నల్లగా కనిపించడం కాలేయ వ్యాధికి హెచ్చరిక సంకేతం. మెలెనా అని పిలిచే ఈ పరిస్థితి కారణంగా.. ఎగువ జీర్ణవ్యవస్థలో రక్తస్రావం జరగడం, అల్సర్ల కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి మలం ఈ రంగులో వస్తుంది. గడ్డకట్టే కారకాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కాలేయం కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీంతో మలం జిగటగా ఉంటుంది, దుర్వాసన వస్తుంది. రక్తం వాంతులు
బ్లడ్ ప్రెజర్‌ను కాలేయం కంట్రోల్ చేయలేకపోవడంతో సిరల్లో (Veins) ఒత్తిడి పెరుగుతుంది. ఈ క్రమంలో అన్నవాహిక లేదా కడుపులోని రక్తనాళాలు (సిరలు) బాగా విస్తరించి కొన్నిసార్లు పగిలిపోతుంటాయి. దీంతో, ఈ రక్తాన్ని బాడీ జీర్ణించుకోలేక వాంతుల ద్వారా బయటకు పంపిస్తుంది. ఈ రక్తం బ్రైట్ రెడ్ కలర్లో లేదా కాఫీ గింజలను పోలి ఉంటుంది. దీనినే హెమటెమిసిస్ (Hematemisis) అని పిలుస్తుంటారు. ఈ పరిస్థితి చాలా ఆందోళనకరమైంది. కాబట్టి, రక్తంతో కూడిన వాంతులు (Blood Vomitings) అవుతుంటే ట్రీట్మెంట్ ఆలస్యం చేయకూడదు.శ్వాస సమస్యలు
శ్వాస తీసుకోవడంలో కలిగే ఇబ్బంది (Breathing Difficulty) శ్వాసకోశ వ్యాధికి కారణమై ఉండొచ్చని భావిస్తుంటారు. అయితే, కాలేయ వ్యాధికి కూడా ఇదొక హెచ్చరిక సంకేతం. ఊపిరి ఆడకపోవడం, ఊపిరి పీల్చేటప్పుడు తగినంత గాలి లభించనట్లు అనిపించడం దీని ముఖ్య లక్షణాలు. కాలేయ పనితీరు బలంగా లేనివారి లంగ్స్‌లో ద్రవం పేరుకుపోవడం వల్ల డయాఫ్రమ్ కుదించుకుపోతుంది. ఫలితంగా ఊపిరి ఆడటం కష్టతరం అవుతుంది. రక్తహీనత, అంతర్గత రక్తస్రావం కారణంగా ఆక్సిజన్ క్యారీ పవర్ తగ్గడం వల్ల కూడా శ్వాస ఆడదు.గందరగోళం, మగత
రక్తం నుంచి అమ్మోనియా వంటి విష వ్యర్థాలను కాలేయం ఫిల్టర్ చేయలేనప్పుడు గందరగోళం (Confusion), మగతగా (Drowsiness) అనిపిస్తుంటుంది. దీంతో టాక్సిన్లను ఫిల్టర్ చేయలేక లివర్ ఫెయిల్ అయ్యి, మెదడు సరిగా పనిచేయదు. పైగా, అమ్మోనియా వంటి పదార్థాలు మెదడు పనితీరును దెబ్బతిస్తాయి. ఫలితంగా, హెపాటిక్ ఎన్సెఫలోపతి అనే పరిస్థితి ఏర్పడి.. అంతా గందరగోళంగా, మగతగా ఉంటుంది. ఎక్కువసేపు మెలకువతో ఉండాలని అనిపించదు.


