LIC’s new policy.. Just buy it once.. Guaranteed pension of 11 thousand per month for life

LIC Policy: పదవీ విరమణ తర్వాత ఒకరిపై ఆధారపడకుండా, ఆర్థిక ఒత్తిడి లేని జీవితం గడపాలనుకునే వారికి ఎల్ఐసీ అందిస్తోన్న ఓ పాలసీ మంచి అవకాశంగా చెప్పవచ్చు. అదే ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్. ఇందులో ఒక్కసారి ప్రీమియం కడితే జీవితాంతం నెల నెలా పెన్షన్ వస్తూనే ఉంటుంది. గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. మరి నెలకు రూ.11 వేలు రావాలంటే ఏం చేయాలి? ఈ ప్లాన్ వివరాలు ఇప్పుడే తెలుసుకోండి. LIC Policy : భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) అన్ని వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. కొద్ది నెలల క్రితం తీసుకొచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పదవీ విరమణ తర్వాత తర్వాత స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారి కోసం న్యూ జీవన్ శాంతి ప్లాన్‌ (New Jeevan Shanti Plan ) తీసుకొచ్చింది. ఈ పాలసీలో ఒకసారి పెట్టుబడి పెడితే చాలు ఆ తర్వాత జీవితాంతం పెన్షన్ మాదిరిగా ఆదాయం పొందవచ్చు. అలా నెలకు రూ.11 వేలకుపైగా గ్యారెంటీ రిటర్న్స్ ఎలా పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎల్ఐసీ అందిస్తోన్న కొత్త ప్లాన్ న్యూ జీవన్ శాంతి పాలసీ ఒక సింగిల్ ప్రీమియం, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. దీని అర్థం ఒకేసారి లంప్‌ సమ్‌ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన వెయిటింగ్ పీరియడ్ తర్వాత (డిఫర్‌మెంట్ వ్యవధి) పెన్షన్ ప్రారంభమవుతుంది. పాలసీదారు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ లభిస్తుంది. దానిని వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక, నెల వారీగా పొందేలా ఎంపిక చేసుకునే వీలుంటుంది. ఈ ప్లాన్‌ నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌ సింగిల్ ప్రీమియం పాలసీ. అంటే మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా ఉంటుంది.

ఈ పాలసీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. సింగిల్ లైఫ్ ప్లాన్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. డిఫర్‌మెంట్ వ్యవధి తర్వాత పెన్షన్ పొందుతారు. పాలసీదారు మరణిస్తే, పెట్టుబడి మొత్తం నామినీకి చెల్లిస్తారు. ఇక జాయింట్ లైఫ్ ప్లాన్ ద్వారా పాలసీదారుతో పాటు మరో వ్యక్తి (సాధారణంగా జీవిత భాగస్వామి) కవరేజీ పొందుతారు. డిఫర్‌మెంట్ పీరియడ్ ముగిసిన తర్వాత, పెన్షన్ ప్రారంభమవుతుంది. పాలసీదారు మరణిస్తే అతడి జీవిత భాగస్వామికి పెన్షన్‌ లభిస్తుంది. ఇద్దరూ మరణించిన తర్వాతే పెట్టుబడి మొత్తం నామినీకి వెళ్తుంది.

30 నుంచి 79 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.
కనీసం రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ఠ పరిమితి ఏమీ లేదు. పెట్టుబడి, పెన్షన్ ప్రారంభానికి మధ్య ఉన్న సమయాన్ని డిఫర్‌‌మెంట్ పీరియడ్ అంటారు. కనిష్ఠంగా 1 సంవత్సరం, గరిష్ఠంగా 12 సంవత్సరాలు ఉంటుంది.

నెలకు రూ. 11 వేలు రావాలంటే ఎలా?

మీకు నెలకు రూ.11 వేలు అంటే ఏడాదికి రూ.1,42,500 యాన్యువల్‌ పెన్షన్‌ పొందాలంటే సింగిల్ లైఫ్ ప్లాన్‌ ఎంచుకుని మీ వయసు 45 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రారంభించారు అనుకుందాం. ఇందుకోసం మీరు రూ.10 లక్షలు ప్రీమియం చెల్లించాలి. డిఫర్‌ పీరియడ్ 12 ఏళ్లు ఎంచుకున్నారు అనుకుంటే ఆ తర్వాత 57 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుంచి ఏడాదికి రూ.1,42,500 చెల్లిస్తుంది ఎల్ఐసీ. ఆరు నెలలకు రూ.69,825 వస్తుంది. మూడు నెలలకు అయితే రూ.34,556, నెలకు అయితే రూ.11,400 పెన్షన్‌ లభిస్తుంది. ఈ పెన్షన్ జీవితాంతం వస్తూనే ఉంటుంది. పాలసీదారు మరణించిన తర్వాత ప్రీమియం అమౌంట్ రూ.10 లక్షలు నామినీకి వెళ్తుంది. జాయింట్ లైఫ్ ప్లాన్ ఎంచుకుంటే సంవత్సరానికి రూ.1,33,400 చెల్లిస్తారు. ఆరు నెలలకు రూ.65,366, మూడు నెలలకు రూ.32,350, నెలకు రూ.10,672 పెన్షన్‌ వస్తుంది.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *