LIC: ఎల్‌ఐసీ కొత్త ఎఫ్‌డీ ప్లాన్.. అర్హత, వడ్డీ రేట్లు, బెనిఫిట్స్ ఇవే!

LIC Senior Citizen FD Plan: సీనియర్ సిటిజన్ల కోసం LIC కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. ప్రత్యేకంగా 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికోసం రూపొందించింది. దేశంలో అతిపెద్ద గవర్నమెంట్ బ్యాక్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), సీనియర్ సిటిజన్ల కోసం కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. ఈ 2025 ఎల్‌ఐసీ సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీ ప్లాన్(LIC Senior Citizen FD)ని ప్రత్యేకంగా 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికోసం రూపొందించింది. ఇది లబ్ధిదారులకు గ్యారెంటీ రిటర్న్స్, ఫ్లెక్సిబుల్ డిపాజిట్ పీరియడ్స్ ఆఫర్ చేస్తోంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న సమయంలో, మార్కెట్లు వోలటైల్‌గా ఉన్నప్పుడు కూడా రిటైర్మెంట్ సేవింగ్స్ సేఫ్‌గా ఉంచుకోవాలనుకునే సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్. స్కీమ్ ఫీచర్లు
ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్ 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ FDలతో పోలిస్తే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది. సంవత్సరానికి 8.25 శాతం వరకు ఇంట్రెస్ట్ చెల్లిస్తుంది. పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు డిపాజిట్ పీరియడ్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మినిమం రూ.10,000 డిపాజిట్ చేయాలి. వడ్డీని క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా యాన్యువల్లీ పొందే ఆప్షన్ ఉంది. ఇందులో లోన్ పొందే అవకాశం కూడా ఉంది. ప్రీ మెచ్యూర్ విత్‌డ్రా ఆప్షన్లు, నామినేషన్, మెచ్యూరిటీలో ఆటో-రెన్యూవల్ వంటి ఫెసిలిటీలు ఉన్నాయి. ఈ ఫీచర్లు సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ రిటర్న్స్‌తో పాటు, ఎమర్జెన్సీలో త్వరగా ఫండ్స్ పొందే అవకాశం కల్పిస్తాయి. వడ్డీ రేట్లు, టెన్యూర్లు
ఎల్‌ఐసీ అన్ని సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం ప్రత్యేక వడ్డీ రేటు ప్రవేశపెట్టింది. వన్ ఇయర్ డిపాజిట్‌కి సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు సంవత్సరానికి 7.25 శాతం అందుతుంది. రెండేళ్ల డిపాజిట్‌కి 7.5 శాతం, మూడేళ్ల డిపాజిట్ 7.75 శాతం, ఫైవ్ ఇయర్ డిపాజిట్‌కి 8.25 శాతం లభిస్తుంది. ప్రస్తుత మార్కెట్లోని లాంగ్ టర్మ్ డిపాజిట్స్ కంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తుంది. 2025లో పదవీ విరమణ చేసిన వారికి ఎల్‌ఐసీ సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అర్హత, అప్లికేషన్ ప్రాసెస్
ఈ స్కీమ్‌కి అర్హత పొందాలంటే డిపాజిట్ చేసే తేదీ నాటికి కనీసం 60 సంవత్సరాలు నిండి ఉండాలి. భారతీయ నివాసితులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవాస భారతీయులు (NRIలు) ఈ పథకానికి అర్హులు కారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ సహా అవసరమైన డాక్యుమెంట్లు ఉండాలి.అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఈజీ. అధికారిక LIC వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని LIC బ్రాంచ్‌ని విజిట్ చేయడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఫారమ్‌ను పూరించాలి. కావలసిన డిపాజిట్ అమౌంట్, టెన్యూర్ సెలక్ట్ చేయాలి. ఏ సమయానికి వడ్డీ అందుకోవాలో తెలియజేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. ప్రాసెస్ పూర్తయిన తర్వాత, LIC ఇంట్రెస్ట్ పేమెంట్ షెడ్యూల్, డిపాజిట్ రెసీప్ట్ అందిస్తుంది. బ్యాంక్ ఎఫ్‌డీ కంటే బెటరా?
LIC సీనియర్ సిటిజన్ FD ప్లాన్, బ్యాంక్ FDల కంటే ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. ఎల్‌ఐసీకి ప్రభుత్వ మద్దతు ఉంటుంది. అలానే వడ్డీ రేట్లు చాలా బ్యాంకుల ఎఫ్‌డీ రేట్ల కంటే ఎక్కువ. ఐదు సంవత్సరాల టెన్యూర్‌కి భారీ రిటర్న్స్ ఆఫర్ చేస్తోంది. వడ్డీ చెల్లించే విషయంలో ఫ్లెక్సిబిలిటీ ఉంది. నెలవారీ ఖర్చుల కోసం వడ్డీపై ఆదాయపడే వారికి అనుకూలంగా ఉంటుంది.
