Leopard runs away in fear after seeing wild boar.. Shocking video goes viral

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది, ఈ వీడియో చూసిన తర్వాత యూజర్లు నిరంతరం కామెంట్లు చేస్తున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో అడవి జంతువులైన అడవి పంది, చిరుతపులి కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఇదే కదా కలికాలం అని అంటున్నారు. అయితే ఈ వీడియో ఎందుకు అంత వైరల్ అవుతుందో తెలుసుకోండి..

అడవిలో నివసించే జంతువులలో సింహాలు, పెద్ద పులులు, చిరుతపులులు వంటివి అత్యంత ప్రమాదకరమైన జంతువులు వేటగాళ్ళుగా పరిగణించబడతాయి. ఇవి చేసే ఒక్క గర్జన అడవి ప్రపంచాన్ని కదిలించడానికి సరిపోతుంది. కొన్ని సార్లు ఏనుగు వంటి పెద్ద జంతువు కూడా వీటిని తప్పించుకుని వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ వీడియో వేరే కథను చెబుతోంది. ఒక అడవి పంది .. అడవిలో క్రూరమైన వేటని వేటాడే జంతువు చిరుత పులిని బెదిరించింది. ప్రాణం కోసం ఆ చిరుత పెరిగెత్తడం మొదలు పెట్టింది. ఈ వీడియోలో అడవి పంది శక్తి ముందు చిరుతపులి కూడా నిస్సహాయంగా మారింది. చిరుత పులి.. పందికి భయపడి వెనక్కి తగ్గవలసి వచ్చినట్లు కనిపించింది.

ఈ మొత్తం దృశ్యం కెమెరాలో రికార్డయింది. దీని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. చిరుతపులి పొదల మధ్య కూర్చుని ఉందని.. సమీపంలో లావుగా ఉన్న అడవి పంది ఉందని వీడియోలో కనిపిస్తుంది. మొదట్లో ఇద్దరికీ ఒకరి ఉనికి గురించి ఒకరికి తెలియదు. అయితే అడవి పంది చిరుతపులి వైపు వెళ్ళగానే.. చిరుతపులి ఒక్క క్షణం భయపడుతుంది. చిరుతపులి తన స్థానం నుంచి కదలదు. అడవి పంది అవకాశం దొరికిన వెంటనే దానిపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో చిరుతపులి తిరగబడి దాడి చేయకుండా పారిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *