Late Night Snacks: లెట్ నైట్ స్నాక్స్ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఈ టిప్స్ పాటించకపోతే అంతే సంగతులు!

Late Night Snacks: లెట్ నైట్ స్నాక్స్ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఈ టిప్స్ పాటించకపోతే అంతే సంగతులు! Late Night Snacks: ఈ రోజుల్లో ఆలస్యంగా స్నాక్స్ తినడం చాలామందిలో సాధారణ అలవాటుగా మారింది. విద్యార్థులు, రాత్రి షిఫ్ట్‌లలో పనిచేసేవాళ్లు లేదా తినడానికి ఇష్టపడేవాళ్లు అర్ధరాత్రి ఆకలి వేస్తే ఏదైనా తినడానికి ఫ్రిజ్‌లో వెతుకుతుంటారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అర్ధరాత్రి స్నాక్స్ తీసుకోవడం చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది.
గత దశాబ్దంలో చేసిన అనేక అధ్యయనాలు రాత్రి ఆలస్యంగా తినడం వల్ల రెండు ప్రధాన తీవ్రమైన పరిణామాలను వెల్లడించాయి. ఈ అలవాటు మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, దీన్ని ఎలా మానుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలస్యంగా తినడం వల్ల కలిగే నష్టాలు..
సిర్కాడియన్ రిథమ్ లో అంతరాయం: సిర్కాడియన్ రిథమ్ అంటే మన శరీరానికి ఉన్న జీవ గడియారం. ఇది నిద్ర, మేల్కొనే చక్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ చక్రం తినడానికి సరైన సమయాలను నిర్ణయిస్తుంది. ఆలస్యంగా తినడం ఈ సమయాల్లో ఒకటి కాదు. 2018లో ‘వరల్డ్ జర్నల్ ఆఫ్ డయాబెటిస్’ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఆలస్యంగా తినడం సిర్కాడియన్ రిథమ్ లో అంతరాయం కలిగిస్తుంది. ఇది నిద్ర నాణ్యత సమయాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

