Kid’s Health: పిల్లల్లో ఈ పోషకాల లోపం ఎక్కువగా ఉంటాయ్.. పేరెంట్స్ ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి..!

Kid’s Health: ఈ రోజుల్లో పిల్లలు పోషకాహార లోపంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఎలాంటి పోషకాల లోపంతో ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
Kid’s Health: చిన్నారులకు పోషకాహారం ఇవ్వడం ఎంతో ముఖ్యం. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు సమతుల్య, పోషకాహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే.. పిల్లలు జంక్‌ఫుడ్, చిప్స్ తిన్నంత ఇష్టంగా.. హెల్తీ ఫుడ్‌ను ఇష్టపడరు. ఆ చిరుతిండ్లతోనే పిల్లలు కడుపు నింపుకుంటారు. దీని వల్ల వారు పోషకాహార లోపానికి గురవుతూ ఉంటారు. దీని కారణంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి.. ఇన్ఫెక్షన్లకు, అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. చిన్నారుల్లో ఎక్కువగా కనిపించే పోషకాల లోపం ఏమిటి? ఈ పోషకాల లోపం భర్తీ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, తగినంత ఐరన్ అవసరం. ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఐరన్ లోపం ఉంటే.. పిల్లల్లో రక్తహీనత సమస్య వస్తుంది. పిల్లల్లో ఐరన్ లోపం కారణంగా అలసట, నీరసం, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి.
విటమిన్ డి లోపం వల్ల ఎముకల బలహీనపడటం, రోగనిరోధక శక్తి బలహీనపడటం ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. విటమిన్ డి లోపం ప్రధానంగా సూర్యరశ్మికి గురికాకపోవడం వల్ల వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సమయం ఇంటి లోప సమయం గడిపే పిల్లలకు, సూర్యకాంతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే పిల్లలు విటమిన్ డి లోపానికి గురవుతూ ఉంటారు. పోషకాల్లో క్యాల్షియం, విటమిన్ డి.. ఎంతో ముఖ్యమైనవి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇవి సరిపడ మోతాదులో శరీరానికి అందకపోతే కండరాల నొప్పి, ఎముకలు బలహీనంగా మారడం.. వంటివి జరుగుతుంటాయి. అలాగే చిన్న పనికే నీరసపడిపోతుంటారు.
కాల్షియం లోపం వల్ల ఎముకలు, దంతాలు బలహీనపడతాయి, అలాగే పెద్దయిన తర్వాత ఎముకలలో పగుళ్లు, ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎముకల పెరుగుదల, శరీర అభివృద్ధి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, కౌమారదశలో ఈ పోషకం చాలా ముఖ్యం.
చిన్నారులలో పోషకాహార లోపం ఉంటే.. తల్లదండ్రులు ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి..

