Kidney Stones: మూత్రం ఆపుకోవడంతో పాటు ఈ అలవాట్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం.. జాగ్రత్త మరి!

మనం పెద్దగా పట్టించుకోని 5 అలవాట్లు, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. శరీరంలో కీలక అవయవాలైన కిడ్నీలు (Kidneys) రక్తంలోని మలినాలను ఫిల్టర్ చేసి వాటిని బయటకు పంపిస్తుంటాయి. అయితే ఈమధ్య కాలంలో వివిధ రకాల కిడ్నీ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) కామన్ ప్రాబ్లమ్‌గా మారింది. తినే ఆహారం, జీవనశైలి మార్పుల కారణంగా ఈ ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా మనం పెద్దగా పట్టించుకోని 5 అలవాట్లు, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
మూత్రం ఆపుకోవడం
కొందరు మూత్ర విసర్జన చేయకుండా బలవంతంగా ఆపుకుంటారు. ఇది ప్రమాదకరమైన అలవాటు. టైమ్‌కి యూరినేషన్ చేయకపోతే మూత్రనాళంలో మినరల్స్ క్రమంగా పేరుకుపోయి కిడ్నీ స్టోన్స్ ఏర్పడవచ్చు. ప్రొటీన్ ఫుడ్
ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడవచ్చు. రెడ్ మీట్, గుడ్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటివి యూరిక్ యాసిడ్‌ను పెంచి, మూత్రాన్ని మరింత ఎసిడిక్‌గా మారుస్తాయి. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి.
ఆక్జాలేట్ కంటెంట్
పాలకూర (Spinach), టీ (Tea), చాక్లెట్ (Chocolate), బీట్‌రూట్ (Beetroot) వంటి వాటిల్లో ఆక్జాలేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం. ఈ ఆహార పదార్థాలను అతిగా తింటే అందులోని ఆక్జాలేట్ యూరిన్‌లోకి వెళ్తుంది. ఆ తర్వాత కాల్షియంతో కలిసి కిడ్నీ రాళ్లను ఏర్పరుస్తుంది.

నీళ్లు తక్కువగా తాగడం
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం.. సరిపడినంత వాటర్ తాగకపోవడం. బాడీ డిటాక్సిఫికేషన్‌కి, హైడ్రేటెడ్‌గా ఉండటానికి, అవయవాలు సరిగా పనిచేయడానికి తగినంత నీరు తాగాలి. బాడీలో వాటర్ కంటెంట్, తగ్గితే యూరిన్ మందంగా మరి అందులో మిగిలిపోయిన మినరల్స్ మూత్రాశయ గోడలకు, మూత్రనాళంలో అతుక్కుపోతాయి. ఇది క్రమంగా రాళ్లు ఏర్పడే అవకాశాలను పెంచుతుంది.
ఉప్పు పదార్థాలు తినడం
సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం కూడా కిడ్నీ స్టోన్స్‌కి కారణం అవుతుంది. ఉప్పు వినియోగం మితిమీరినప్పుడు అందులోని సోడియం స్థాయులు.. క్యాల్షియంను మూత్రంలోకి పంపిస్తాయి. ఫలితంగా, మూత్రాశయంలో కాల్షియం స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది.
మెడికేషన్స్
కొన్ని రకాల మందులు వాడేవారికి కిడ్నీ స్టోన్స్ వచ్చే ముప్పు ఉంటుంది. ముఖ్యంగా, విటమిన్ C, యాంటాసిడ్స్, డైయురెటిక్స్ వంటి సప్లిమెంట్లు కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయి.
షుగరీ ఫుడ్స్, డ్రింక్స్
షుగరీ ఫుడ్స్, డ్రింక్స్ ఎక్కువగా తాగినా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. టేబుల్ షుగర్, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ వంటివాటిల్లో షుగర్ కంటెంట్ ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది కిడ్నీ స్టోన్స్‌కి దారితీస్తుంది.
ఈ సమస్య ఎందుకు వస్తుంది?
యూరిన్‌లో ఉండే మినరల్స్, యాసిడ్ సాల్ట్స్ కలిసి చిన్న రాళ్లు లేదా స్ఫటికాలుగా ఏర్పడతాయి. ఇవి పెరుగుతూ రాళ్లుగా మారతాయి. సాధారణంగా మూత్రంలోనే ఈ రాళ్లు పడిపోతుంటాయి. కానీ వీటి సైజ్ ఎక్కువైతే మూత్రనాళాల్లో, మూత్రాశయంలో తట్టుకొని తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. కొన్నిసార్లు మూత్రంలో రక్తం రావడం పాటు వాంతులు అవుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

