KGF 2: కేజీఎఫ్ 2 పీఎం అందం అదరహో.. 52 ఏళ్ల వయసులో కూడా ఫర్ఫెక్ట్ ఫిగర్

బాలీవుడ్ మస్త్ మస్త్ గర్ల్ రవీనా టాండన్ తన గ్లామర్‌తో మరోసారి వేడి పుట్టిస్తోంది. త్వరలో తన రాబోయే చిత్రం KGAP చాప్టర్ 2ని తీవ్రంగా ప్రమోట్ చేస్తోంది ఈ భామ. ఈ చిత్రంలో ఆమె ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రలో కనిపించనుంది. చిత్ర ప్రమోషన్ ఈవెంట్‌కు గ్లామరస్ స్టైల్‌లో హాజరయ్యేందుకు నటి వచ్చింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రవీనా టండన్‌ను ఇలా చూసిన వారు ఎవరైనా సరే ఆమెకు 52 ఏళ్లంటే ఏ మాత్రం నమ్మలేరు. ఈ వయసులో కూడా ఆమె తన అందంతో ఆడియన్స్‌ను కట్టి పడేస్తోంది. రవీనా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఆమె తమ గ్లామర్, ఫిజిక్ మెంటైన్ చేయడంలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నేటికి రవీనా అందాన్ని చూస్తే కోట్లాది మంది ఫిదా అవ్వాల్సిందే. ఆమె స్కీన్ టోన్,ఫిగర్, ఫేస్ గ్లో చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ చిత్రాలలో రవీనా స్టైల్ చూసి నెటిజన్లు ఆమెపై ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు మస్త్ మస్త్ గర్ల్‌ని ప్రపంచంలోనే అత్యంత అందమైన నటిగా చెబుతున్నారు. ఆమె మరోసారి పరిశ్రమకు పూర్తి ఉత్సాహంతో రీ ఎంట్తిరీ ఇచ్చింది. ఇటీవల, రవీనా టాండన్ యష్ నటించిన KGF: చాప్టర్ 2లో తన భాగానికి డబ్బింగ్ పూర్తి చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవీనా ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తోంది.

