Kasivinda Plant: This is not just a leaf.. but a treasure trove of medicine for health..! A panacea for seasonal diseases..

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక ఔష‌ధ‌ మొక్కలు ఉన్నాయి. కానీ, వాటి గురించి పెద్దగా పట్టించుకోం. అలాంటి ఔషధ గుణాల‌ను క‌లిగి ఉండి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే చెట్లల్లో క‌సివింద చెట్టు కూడ ఒక‌టి. దీనిని చిన్న చెన్నంగి అని కూడా పిలుస్తారు. చెన్నంగి ఆకులతో కూర, పప్పు, పచ్చడి చేసుకుని తింటారు దీని గురించి తెలిసిన వారు. చెన్నంగిని ఉప‌యోగించి క‌డుపులో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

చెన్నంగి.. దీన్నే కసివింద అని కూడా అంటారు..చెన్నంగి ఆకులతో పచ్చడి చేసుకుని తింటే..నోటికి రుచిస్తుంది. జ్వరంతో నోటి రుచి కోల్పోయిన వారికి ఈ చట్నీ తిరిగి రుచి తెలిసేలా చేస్తుంది. ఎన్నో ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగిన చెన్నంగిలో చిన్న క‌సివింద‌, పెద్ద క‌సివింద అని రెండు ర‌కాల చెట్లు ఉంటాయి. దీనిని చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు..

క‌సివింద చెట్టు ఆకుల‌ను వెన్న‌తో నూరి చ‌చ్చుబ‌డిన ప‌క్ష‌వాత భాగాల‌పైన ప్ర‌తిరోజూ మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల అవి పూర్వ స్థితికి చేరుకుంటాయి. క‌సివింద ఆకుల‌ను, వేరు బెర‌డును ఎండ‌బెట్టి పొడిలా చేసుకుని తేనెను క‌లిపి లేప‌నంగా రాసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల చ‌ర్మ వ్యాధులు, గాయాలు, వ్ర‌ణాలు త‌గ్గుతాయి.

చిన్న చెన్నంగిని ఉప‌యోగించి క‌డుపులో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. క‌సివింద చెట్టు ర‌సం చేదుగా ఉండి వేడిని క‌లిగిస్తుంది. దీనిలోని గుణాలు వాతాన్ని, విషాన్ని హ‌రించే శ‌క్తి ఈ క‌సివింద చెట్టుకు ఉంది. గాయాల‌ను, వ్ర‌ణాల‌ను, చ‌ర్మ రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఈ మొక్క పువ్వుల‌ను దంచి వ‌స్త్రంలో వేసి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని ఒక‌టి లేదా రెండు చుక్క‌ల ప‌రిమాణంలో కంటిలో వేసుకుంటూ ఉంటే ఏడు రోజుల‌ల్లో రేచీక‌టి త‌గ్గుతుంది. క‌సివింద గింజ‌ల‌ను దోర‌గా వేయించి పొడి చేసుకుని త‌గిన‌న్ని పాలు, కండ‌చ‌క్కెర క‌లిపి కాఫీ లా తాగుతూ మూత్ర సంబంధిత రోగాలు త‌గ్గుతాయి. ర‌క్తం కూడా శుద్ధి అవుతుంది.

శరీరానికి ఏదైనా గాయం అయినప్పుడు ఆగ‌కుండా రక్తం కారుతూ ఉంటే, ఈ చెట్టు ఆకులను దంచి క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల గాయాల నుండి ర‌క్తం కార‌డం త‌గ్గుతుంది. ఇలా క‌సివింద చెట్టుతో మ‌నం బోలెడు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌ల‌కుండా ఇంటికి తెచ్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.







		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *