Jr Ntr Birth Day: జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్.. యంగ్ టైగర్ లక్కీ నెంబర్ ఏదో తెలుసా..?

ఈ రోజు (మే 20) జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు (Jr Ntr Birthday). నేటితో 41వ వసంతంలోకి అడుగు పెడుతున్నారాయన. ఈ సందర్భంగా ఆయన అభిమానుల ట్వీట్లతో సోషల్ మీడియాలో #NtrBirthday హ్యాష్ ట్యాగ్ మోత మోగుతోంది. తమ అభిమాన హీరో బర్త్ డే కావడంతో జనం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
ఇకపోతే యంగ్ టైగర్ క్రేజ్ ఎన్టీఆర్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాలా. బాలనటుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా వైడ్ ఫాలోయింగ్ సంపాదించారు ఎన్టీఆర్. భారీ డైలాగులు, పవర్ ఫుల్ సీన్లకు కేరాఫ్ అడ్రస్ అవుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్, పైట్స్ అంటారా? దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.
నందమూరి నటవారసుడిగా టాలీవుడ్ లో సత్తా చాటుతున్న ఎన్టీఆర్.. ఇండస్ట్రీ ఆల్ రౌండర్ గా కీర్తించబడుతున్నారు. కెమెరా ముందు ఎలాంటి రోల్ అయినా సరే.. పండించగలిగే సత్తా ఎన్టీఆర్ లో ఉంది. తాతకు తగ్గ మనవడిగా తెలుగు తెరపై దూసుకుపోతున్నారాయన.
బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో బాలనటుడిగా సినీ ఆరంగేట్రం చేసిన ఎన్టీఆర్.. ఆ తర్వాత బాల రామాయణం సినిమాలో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ అయ్యారు.

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 బ్లాక్ బ్లస్టర్తో ఎన్టీఆర్ కెరీర్ గాడిలో పడింది. అప్పటి నుంచి వెనుతిరిగి చూడని యంగ్ టైగర్, ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ కొట్టేశారు. దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ పేరు వరల్డ్ వైడ్ మారుమోగింది.
చిన్నవయసులోనే దేశవ్యాప్తంగా 100కు పైగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు ఎన్టీఆర్. ఆయన డాన్స్ అంటే నేటి యువతకు పిచ్చి. క్లాస్, మాస్ స్టెప్స్ తో స్టేజ్ దద్దరిల్లేలా డాన్సులు చేయడం ఎన్టీఆర్ ప్రత్యేకత.

News by : V.L
