తెనాలి లో రెండవ రోజు కోనసాగుతున్న జర్నలిస్టుల శిక్షణా తరగతులు …

తెనాలి రాష్ట్ర వార్త : ఏ పే డబ్ల్యూ జె సి.ఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తెనాలి శాఖ సహకారంతో గుంటూరు జిల్లా లోని జర్నలిస్టులకు శిక్షణా తరగాథలు జరుగుతున్నాయి.
ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమంలో రెండవ రోజు జరిగే శిక్షణా తరగతిలో భాగంగా సీనియర్ జర్నలిస్టులు డి రామకృష్ణ, సోమసుందర్, మంగేష్, అజైలు పాల్గొని విలేఖర్లు నుంచి డెస్క్ ఏమి కోరుకుంటుంది. గ్రామీణ కధనాలు, పత్రిక బాషా ఎలా ఉండాలి వాటిల్లో మెళుకువలు స్మార్ట్ రిపోర్టింగ్ అంటే ఏమిటి తదితర అంశాల ఫై విలేకరులకు శిక్షణా తరగతులు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెనాలి ఏ పే డబ్ల్యూ జె అధ్యక్షలు చందు సుబ్బారావు కార్యదర్శి ఏం గోపీచంద్, కోశాధికారి దీపాల సాయినాధ్ లు పర్యవేక్షిస్తూ బయట ప్రాంతాల నుంచి వచ్చిన విలేకరులకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
