Jaggery Benefits: పంచదార ప్రమాదకరం.. దాని బదులు బెల్లం వాడండి.. ఈ 11 ప్రయోజనాలు పొందండి!

Jaggery Health Benefits: సాధారణంగా మనం తీపి కోసం పంచదార వాడతాం. కానీ అది డయాబెటిస్ వచ్చేందుకు కారణం అవుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించేస్తుంది. అందువల్ల పంచదార కంటే బెల్లం వాడటం చాలా మంచిది. దాన్ని వీలైనంతవరకూ సహజంగా తాయారుచేస్తారు కాబట్టి.. దాని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. పంచదార వాడితే డయాబెటిస్ ఎందుకొస్తుంది? రాదు అని కొంతమంది చెబుతుంటారు. నిజమేంటంటే.. పంచదార వాడితే, డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే.. పంచదార అనేది సహజమైనది కాదు. రకరకాల పదార్థాలను కలుపుతూ, అది క్రిస్టల్స్ రూపంలో, గట్టిగా ఉండేలా తయారుచేస్తారు. పంచదార మన శరీరంలోకి వెళ్లాక.. వెంటనే బాడీలో కలవదు. అది గ్లూకోజ్ రూపంలో తిష్ట వేస్తుంది. అది ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి అవ్వనివ్వదు. దాంతో.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే పంచదార బదులు.. బెల్లం వాడమని ఈ రోజుల్లో డాక్టర్లు సూచిస్తున్నారు. మన పూర్వీకులు, పెద్దలు చక్కెర చాలా తక్కువగా వాడేవాళ్లు. ఏ స్వీటైనా, టీ అయినా దేనికైనా బెల్లం వాడేవాళ్లు. మరి బెల్లం వాడితే మనకు కలిగే 11 ప్రయోజనాలను తెలుసుకుందాం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది: బెల్లానికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఇది బ్లడ్ ప్యూరిఫైయర్‌లా పనిచేస్తుంది. దీన్ని తరచుగా కొద్ది మొత్తాల్లో తీసుకుంటూ ఉంటే, రక్తాన్నిశుద్ధి చేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా మార్చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని కూడా పెంచుతుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. మహిళలు బెల్లం వాడితే, వారి ఆరోగ్యం మెరుగవుతుంది. బలహీనత తగ్గుతుంది. రక్తం పరిశుభ్రంగా ఉన్నప్పుడు చాలా రకాల వ్యాధులు శరీరానికి రావు. అలాగే తిన్న ఆహారం శరీరానికి వంటబడుతుంది. జీర్ణక్రియకు మేలు: బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. మన శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు వెళ్లవు. అధిక బరువు ఆందోళన ఉండదు. రోజూ రాత్రి వేళ, భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తింటే మనకు చాలా లాభాలు కలుగుతాయి. జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. బెల్లంలోని ఔషధ గుణాలు, జీర్ణాశయంలోని డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. మలబద్దకం, గ్యాస్, ఏసీడీటీ సమస్యలు కూడా ఉండవు. పొట్ట చల్లగా ఉండాలంటే బెల్లం షర్బత్ తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.కీళ్లనొప్పులు తగ్గిస్తుంది: వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో బలం తగ్గుతుంది. దాంతో జాయింట్ల దగ్గర నొప్పి మొదలవుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు, మంటలతో బాధపడేవాళ్లు రోజూ కొద్దిగా బెల్లం తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇది వారికి ఎంతో ఎక్కువ రిలీఫ్ కలిగిస్తుంది. కొద్దిగా అల్లం కూడా కలిపి తింటే ఇంకా ఎక్కువ ఉపశమనం కలుగుతుంది. రోజూ పాలలో బెల్లం కలుపుకుని తాగితే, ఎముకలు పుష్టిగా అవుతాయి. తద్వారా కీళ్ల నొప్పుల సమస్య తీరుతుంది.కాలేయాన్ని కాపాడుతుంది: ఈ రోజుల్లో లివర్ సమస్యలు ఎక్కువవుతున్నాయి. చాలా మందికి ఫ్యాటీ లివర్ సమస్య వస్తోంది. దాంతో లివర్ని కాపాడుకునే చర్యలపై డాక్టర్లు ఫోకస్ పెడుతున్నారు. బెల్లం మన శరీరంలోని లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. రోజూ బెల్లం తింటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్ శుభ్రంగా ఉంటుంది. కాలేయ సంబంధ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. మద్యం తాగేవారికి ఇది మంచి చిట్కా అవుతుంది.హైబీపీ కంట్రోల్లో ఉంటుంది: కొంతమంది డయాబెటిస్ కంటే హైబీపీ ఎక్కువ ప్రమాదకరం అంటారు. ఎందుకంటే బీపీ ఎక్కువైతే, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల హైబీపీ సమస్య ఉండేవారు రెగ్యులర్‌గా బెల్లం వాడాలి. ఇందులో పొటాషియం, సోడియం ఉంటాయి. ఇవి శరీరంలో యాసిడ్ లెవెల్స్‌ని క్రమపద్ధతిలో ఉంచుతాయి. వీటి ద్వారా బ్లడ్ ప్రెష్షర్ కంట్రోల్లో ఉంటుంది. గుండెపై అధిక ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ బ్లడ్ పంపింగ్ చెయ్యాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది.

