తురకపాలెం వరుస మరణాలకు కారణం ఇదేనా ?

రాష్ట్ర వార్త :
తురకపాలెం మరణాల కేసులో కీలక మలుపు.. ఆర్ఎంపీ నిర్వాకమే కారణమా?
గుంటూరు జిల్లా తురకపాలెం వరుస మరణాలపై వీడని మిస్టరీ
స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంపైనే ప్రధానంగా అనుమానాలు
కలుషిత సెలైన్, శక్తిమంతమైన మందులే కారణమని భావిస్తున్న అధికారులు
ఆర్ఎంపీ క్లినిక్‌ను సీజ్ చేసి, వైద్యుడిని అదుపులోకి తీసుకుని విచారణ
పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ దర్యాప్తు బృందం
గుంటూరు జిల్లా తురకపాలెంలో తీవ్ర కలకలం రేపిన వరుస మరణాల కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ విషాద ఘటనలకు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. కలుషితమైన సెలైన్ వాడకం వల్లే ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా మారి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
గ్రామంలో జ్వరంతో బాధపడిన వారంతా మొదట ఈ ఆర్ఎంపీ వద్దకే వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. వారికి కలుషితమైన సెలైన్లతో పాటు, మోతాదుకు మించి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఆర్ఎంపీ దగ్గర చికిత్స తీసుకున్న తర్వాతే బాధితుల ఆరోగ్యం మరింత విషమించిందని,తెలిపారు

