కత్తులతోరౌడీ షీటర్ నసీర్ హల్ చల్
హైదరాబాద్లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నసీర్ వీరంగం సృష్టించాడు. నెహ్రు నగర్ కాలనీలో కత్తులు పట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. రోడ్డుపై కనిపించిన వారిపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అంతేకాకుండా, నసీర్ పలు వాహనాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వీధుల్లో నడిరోడ్డుపై రౌడీ షీటర్ హంగామాతో స్థానికులు హడలిపోయారు.


