Is it really that cruel? Daughter-in-law beat her to death with a pen after her aunt asked for money.

మందులకు, తిండికి డబ్బులు అడుగుతోందని అత్తను హతమార్చింది కోడలు.. ఆపై ఆ హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం బెడిసి కొట్టడంతో కటకటాల పాలయ్యింది. కుటుంబ సభ్యుల అనుమానం, పోలీసుల ఎంట్రీతో.. అత్త హత్య కహానీ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి.. కోడలిని అరెస్టు చేశారు.మందులకు, తిండికి డబ్బులు అడుగుతోందని అత్తను హతమార్చింది కోడలు.. ఆపై ఆ హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం బెడిసి కొట్టడంతో కటకటాల పాలయ్యింది. కుటుంబ సభ్యుల అనుమానం, పోలీసుల ఎంట్రీతో అత్త హత్య కహానీ వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. వృద్ధాప్యంలో ఉన్న అత్తకు సేవ చేయాల్సిందిపోయి ఓ కోడలు అత్తపై విచక్షణారహితంగా దాడిచేసి హత్య చేసింది. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్డి ఎల్లమ్మ ఆమె కుమారుడు మల్లయ్య, కోడలు దొడ్డి బొగురమ్మ వద్ద నివాసం ఉంటోంది. కొన్నాళ్ల క్రితం ఎల్లమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఇంటివద్దే చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో మందులు, తిండి కోసం తరచూ కొడుకు, కోడలను డబ్బులు అడుగుతోంది. అయితే, పదే పదే డబ్బులు అడగడం కోడలు బొగురమ్మకు విసుగు తెప్పించింది. ఈ అంశంలోనే తరచూ అత్త, కోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అత్తను మొత్తానికే తుదిముట్టిస్తే ఎలాంటి వేధింపులు, గొడవలు ఉండవని నిర్ధారించుకుంది. ఈ నెల 4వ తేదిన మధ్యాహ్నం ఇరుగుపొరుగు ఎవరూ లేని సమయం చూసుకొని అత్త హత్యకు స్కెచ్ వేసింది. కర్ర, రొట్టె పెంకతో అత్త ఎల్లమ్మపై విచక్షణారహితంగా దాడి చేసింది. గాయాలు తాళలేక అత్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొయింది.సహజ మరణంగా చిత్రీకరణ..

అత్తను చంపిన హత్యనేరం తనమీదకు రాకుడదని సహజ మరణంగా చిత్రీకరించింది కోడలు బొగురమ్మ. భర్త వ్యవసాయ పొలం వద్ద నుంచి వచ్చే లోపు ఇంట్లో హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేసింది. మంచం, నేలపై పడిన రక్తపు మరకలను తుడిచి వేసింది. ఏమి తెలియనట్టుగా తన అత్త వయో భారం, అనారోగ్యం కారణంగా కాలం చేసిందని చుట్టుపక్కల వారికి, బంధువులకు చెప్పింది. అయితే, అందరూ నిజంగానే సహజంగానే ఎల్లమ్మ మరణించిందని భావించారు. ఈ నెల 5న మృతురాలి దహన సంస్కారాలకు ఏర్పాట్లు సైతం చేశారు. అంత్యక్రియలకు ఎల్లమ్మను సిద్ధం చేస్తుండగా వీపు భాగంలో రక్తపు గాయాలను కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే అక్కడే ఉన్న బొగురమ్మను నిలదీశారు. చేసేది లేక చేసిన నేరాన్ని అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు వివరించింది. ఇక తన తల్లిని కొడలు బొగురమ్మే చంపిందని కూతురు బచ్చమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బొగురమ్మను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా హత్య నేరాన్ని అంగీకరించింది. తరచూ డబ్బులు అడుగుతుందన్న కారణంతోనే అత్తను హత్య చేసినట్లు కొడలు తెలిపింది. హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకొని.. బొగురమ్మను రిమాండ్ కు తరలించారు ఖాకీలు.

తల్లి తర్వాత తల్లిగా భావించే అత్తను కిరాతకంగా కొట్టిచంపడం స్థానికంగా కలకలం రేపింది. వృద్ధాప్యంలో ఉన్న అత్తకు అండగా ఉండాల్సిన కోడలు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *