షుగర్ ఉన్న వారు స్వీట్ కార్న్ తినడం మంచిదేనా, ఎలా తీసుకుంటే బెటర్

షుగర్ ఉన్న వారు స్వీట్ కార్న్ తినవచ్చా అన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. అయితే.. మామూలు మోతాదులో తీసుకుంటే దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అతిగా తింటే మాత్రం ముప్పు తప్పదు.
షుగర్ వచ్చిన తరవాత తినే ప్రతిదీ గమనించుకోవాల్సి వస్తుంది. ఎందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంది, ఏది సులువుగా జీర్ణం అవుతుంది. ఇలా లెక్కలు వేసుకుని తినాలి. అయితే..కొంత మంది తెలియక, అవగాహన లేక కొన్ని ఆహార పదార్థాలను తినేస్తారు. చివరకు అది తేడా కొట్టిన తరవాత ఇబ్బంది పడతారు. తీపిగా ఉండే పదార్థాలంటే ఇష్టం ఉండడం వల్ల తినేసి చివరకు బాధ పడతారు. స్వీట్ కార్న్ కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. మరి డయాబెటిస్ పేషెంట్స్ స్వీట్ కార్న్ తినవచ్చా అన్నదే ఇప్పుడు చెప్పుకోబోతున్న విషయం. చాలా మందికి ఈ అనుమానం ఉండే ఉండవచ్చు. మరి షుగర్ ఉన్న వాళ్లు స్వీట్ కార్న్ తినవచ్చా లేదా అన్నది వివరంగా తెలుసుకుందాం.
న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉండి రుచిని కూడా అందించే ఫుడ్ స్వీట్ కార్న్. అయితే..దీని వల్ల డయాబెటిస్ పేషెంట్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందన్నది గమనించాలి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు శరీరానికి అవసరమైన విటమిన్స్ ఇందులో ఉంటాయి. మొత్తంగా ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే ఇందులో నేచురల్ షుగర్స్ అధికంగా ఉంటాయి. దీంతో పాటు కార్బొహైడ్రేట్స్ కూడా ఎక్కువే. వీటి వల్ల కొన్ని సార్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు ఈ తేడా కనిపిస్తుంది. అయితే.. అసలు స్వీట్ కార్న్ తినడం వల్ల డయాబెటిస్ ఎందుకు పెరుగుతుందన్నదీ తెలుసుకోవాలి. నిజానికి..మామూలు మోతాదులో తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోషకాలతో పాటు మంచి రుచిని కూడా అందిస్తుంది. కానీ.. మోతాదు మించితే మాత్రం ముప్పు తప్పదు. ఆహార పదార్థంలోనైనా మంచి చెడు ఉంటాయి. అదే విధంగా స్వీట్ కార్న్ విషయంలోనూ కొన్ని పరిగణనలోకి తీసుకోవాలి. డయాబెటిస్ పేషెంట్స్ కి దీని వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. స్వీట్ కార్న్ ని ఏ రూపంలో, ఎంత మొత్తంలో తీసుకుంటున్నారన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. స్వీట్ కార్న్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పైగా గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. అంటే.. షుగర్ పేషెంట్స్ తినవచ్చు అనడానికి ఇదే ప్రామాణికం. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో షుగర్ ఎక్కువ మొత్తంలో విడుదల కాదు. రక్తనాళాల్లో చక్కెర పేరుకుపోయే ముప్పు కూడా ఉండదు. అమాంతం షుగర్ లెవెల్స్ పెరగదు. అయితే..ఇక మరో కోణంలో చూస్తే..వీటిలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువ. మరీ ఎక్కువ మిగతా కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తో కలిపి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

