Investments: Just invest Rs.4,000 per month.. Chance to earn Rs.1,00,00,000.. Just do this!

nvestments: మీ వెల్త్‌ బిల్డింగ్‌ జర్నీ స్టార్ట్‌ చేయడానికి సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌(SIP) బెస్ట్‌ ఆప్షన్‌. వీటి ద్వారా ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో ఫిక్స్‌డ్‌ అమౌంట్‌ ఇన్వెస్ట్‌ చేయవచ్చు.లైఫ్‌లో కోటీశ్వరులు అయితే బాగుంటుందని చాలా మందికి ఉంటుంది. కానీ తక్కువ శాలరీ సంపాదించేవారు అది సాధ్యం కాదని ఫిక్స్‌ అయిపోతారు. ఎంతో కొంత మనీ సేవ్‌ చేసుకుందామని అనుకుంటారు. అదే వాళ్లు చేసే పొరపాటు. నెలకు రూ.20,000 సంపాదించే వాళ్లు కూడా కోటి రూపాయలు సంపాదించవచ్చు. అయితే దీనికి డిసిప్లైన్‌, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌, లాంగ్‌ టర్మ్‌ కమిట్‌మెంట్‌ అవసరం. తక్కువ శాలరీతో రూ.1 కోటి సేవ్‌ చేయడం ఎలానో తెలుసుకుందాం.స్మాల్‌, కన్సిస్టెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌
మీ వెల్త్‌ బిల్డింగ్‌ జర్నీ స్టార్ట్‌ చేయడానికి సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌(SIP) బెస్ట్‌ ఆప్షన్‌. వీటి ద్వారా ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో ఫిక్స్‌డ్‌ అమౌంట్‌ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. చాలా వరకు మినిమం ఇన్వెస్ట్‌మెంట్‌ రూ.500తో పెట్టుబడి పెట్టవచ్చు. సిప్‌ సాయంతో తక్కువ జీతం ఉన్నవాళ్లు కూడా ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఈజీగా మేనేజ్‌ చేయగలరు. కాలక్రమేణా ఈ స్మాల్‌ కాంట్రిబ్యూషన్స్‌ కాంపౌండింగ్ పవర్‌తో మంచి రిటర్న్స్‌ ఇస్తాయి. మీరు సంపాదించిన రిటర్న్స్‌ కూడా ప్రాఫిట్స్‌ జనరేట్‌ చేయడం ప్రారంభిస్తాయి. మీరు రూ.20,000 జీతం నుండి నెలకు రూ.4,000 మాత్రమే పక్కన పెట్టగలిగితే సరిపోతుంది. ఇది మీరు స్మాల్‌ అమౌంట్‌ కదా, రూ.కోటి ఎప్పటికి అవుతుంది అనిపించవచ్చు. కానీ కాలం గడిచేకొద్దీ కాంపౌండింగ్‌ పవర్‌ ఇంపాక్ట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇతర ఖర్చులు ఎదురైనా సరే, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లానింగ్‌కి కమిటెడ్‌గా ఉండటం ముఖ్యం.స్టెప్-అప్ సిప్‌ పవర్‌
  మీ రిటర్న్స్‌ మరింత పెంచుకోవడానికి మీరు స్టెప్-అప్ SIPని ఎంచుకోవచ్చు. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని ప్రతి సంవత్సరం 10 శాతం పెంచాలి. ఉదాహరణకు మీరు నెలకు రూ.4,000 SIPతో ప్రారంభించి, దాన్ని ఏటా 10% పెంచితే, మీరు దాదాపు 22 సంవత్సరాల్లో మీ రూ.కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఎలాగంటే, మీకు యావరేజ్‌ రిటర్న్స్‌ 12% వస్తాయని అనుకుందాం. 22 ఏళ్లలో మీరు స్టెప్‌ అప్‌ సిప్‌ ద్వారా మొత్తం రూ.34.27 లక్షలు పెట్టుబడి పెడతారు. కాలక్రమేణా  ఈ పెట్టుబడులు దాదాపు రూ.74.41 లక్షల రాబడిని ఇస్తాయి. కాలిక్యులేషన్స్‌ ఇలా..

1వ సంవత్సరం: రూ.4,000/నెల, రూ.48,000/సంవత్సరం
2వ సంవత్సరం: రూ.4,400/నెల, రూ.52,800/సంవత్సరం
3వ సంవత్సరం: రూ.4,840/నెల, రూ.58,080/సంవత్సరం
4వ సంవత్సరం: రూ.5,324/నెల, రూ.63,888/సంవత్సరం
5వ సంవత్సరం: రూ.5,856/నెల, రూ.70,272/సంవత్సరం
6వ సంవత్సరం: రూ.6,441/నెల, రూ.77,292/సంవత్సరం
7వ సంవత్సరం: రూ.7,085/నెల, రూ.85,020/సంవత్సరం
8వ సంవత్సరం: రూ.7,794/నెల, రూ.93,528/సంవత్సరం
9వ సంవత్సరం: రూ.8,573/నెల, రూ.1,02,876/సంవత్సరం
10వ సంవత్సరం: రూ.9,430/నెల, రూ.1,13,160/సంవత్సరం

11వ సంవత్సరం: రూ.10,373/నెల, రూ.1,24,476/సంవత్సరం
12వ సంవత్సరం: రూ.11,411/నెల, రూ.1,36,932/సంవత్సరం
13వ సంవత్సరం: రూ.12,552/నెల, రూ.1,50,624/సంవత్సరం
14వ సంవత్సరం: రూ.13,807/నెల, రూ.1,65,684/సంవత్సరం
15వ సంవత్సరం: రూ.15,188/నెల, రూ.1,82,256/సంవత్సరం
16వ సంవత్సరం: రూ.16,707/నెల, రూ.2,00,484/సంవత్సరం
17వ సంవత్సరం: రూ.18,377/నెల, రూ.2,20,524/సంవత్సరం
18వ సంవత్సరం: రూ.20,214/నెల, రూ.2,42,615/సంవత్సరం
19వ సంవత్సరం: రూ.22,240/నెల, రూ.2,66,876/సంవత్సరం
20వ సంవత్సరం: రూ.24,464/నెల, రూ.2,93,564/సంవత్సరం
21వ సంవత్సరం: రూ.26,910/నెల, రూ.3,22,920/సంవత్సరం
22వ సంవత్సరం: రూ.29,601/నెల, రూ.3,55,212/సంవత్సరం

22 సంవత్సరాల తర్వాత
మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌: రూ.34,27,333
అంచనా వేసిన రాబడి: రూ.72,17,240
మొత్తం కార్పస్ విలువ: రూ.1,06,44,573

స్మార్ట్‌ ఇన్వెస్టింగ్‌
మ్యూచువల్ ఫండ్స్‌లో SIPలు స్ట్రాంగ్‌ ఫౌండేషన్‌ అయినప్పటికీ, ఒకే రకమైన ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆధారపడటం ప్రమాదకరం కావచ్చు. మీ ఆదాయం పెరిగేకొద్దీ, మీ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేయడం ముఖ్యం. అంటే మీ డబ్బును వివిధ అస్సెట్‌ క్లాసెస్‌లోకి మళ్లించడం ద్వారా రిస్కును తగ్గించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *