influencer Trap: అలా టెంప్ట్ చేసి పడేసింది.. లైఫ్‌లో వేరే పిల్ల జోలికి పోకుండా చేసింది

Honey Trap: కొన్ని పరిచయాలు జీవితాల్నే మార్చేస్తాయి. మరికొందరితో స్నేహం లైఫ్‌ని అనేక మలుపులు తిప్పుతుంది. మరీ ముఖ్యంగా అందంగా ఉండే అమ్మాయిలను చూసి మనసు పారేసుకుంటే తర్వాత డబ్బు, పరువు, శీలం అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుందనే విషయాన్ని మార్చిపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.<strong>Honey Trap:</strong> కొన్ని పరిచయాలు జీవితాల్నే మార్చేస్తాయి. మరికొందరితో స్నేహం లైఫ్‌ని అనేక మలుపులు తిప్పుతుంది. మరీ ముఖ్యంగా అందంగా ఉండే అమ్మాయిలను చూసి మనసు పారేసుకుంటే తర్వాత డబ్బు, పరువు, శీలం అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుందనే విషయాన్ని మార్చిపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌కి ఇద్దరు యువకులు ఫిర్యాదు చేశారు. తాము ఓ అమ్మాయి వలలో పడి పెద్దమొత్తంలో డబ్బులు నష్టపోయామని.. ఫ్రెండ్‌షిప్ పేరుతో సోషల్ మీడియాలో దగ్గరైన యువతి ప్రేమ పేరుతో ఒకరిని… రెండో పెళ్లి పేరుతో మరొకరు దగ్గర నమ్మించి కోట్లరూపాయలు దోచుకుంది.విశాఖపట్నం కేంద్రంగా సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ సౌమ్యా శెట్టికి సంబంధించిన మోసపూరిత వ్యవహారాలు మరోసారి కలకలం రేపాయి.

ఇద్దరు యువకులను ప్రేమ పేరుతో హనీ ట్రాప్ చేసి, వారి నుంచి ఏకంగా కోటి రూపాయలకు పైగా డబ్బు గుంజుకున్నట్లు బాధితులు తీవ్ర ఆరోపణలు చేశారు.కలర్‌ఫుల్ ఫోటోలు, రీల్ వీడియోలతో కుర్రాళ్లకు వలపు వల విసురుతూ వాళ్లను తన మాటలు, చేష్టలతో లోబర్చుకోవడం సౌమ్యా శెట్టికి వెన్నతో పెట్టిన విద్య అని బాధితులు స్వయంగా పోలీసులకే తెలిపారు. సౌమ్యా శెట్టి తన సోషల్ మీడియా పరిచయాలను అడ్డం పెట్టుకుని ఆర్థికంగా స్థిరపడిన యువకులను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో బాధితులే లక్ష్మికాంత్ రెడ్డి, రాజేష్. వీళ్లిద్దరి నుంచి డబ్బు వసూలు చేసినట్లుగా అందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా పోలీసులకు చేరాయి.హైదరాబాద్ నానాక్‌రామ్ గూడాలో నివాసముంటు్న లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడితో సౌమ్య పరిచయం పెంచుకుంది. అతన్ని పూర్తిగా నమ్మించడం కోసం, అతనికి రెండో భార్యగా ఉంటానంటూ వలపు వల విసిరింది. ఈ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఇతర వ్యక్తిగత అవసరాలు ఉన్నాయని చెబుతూ లక్ష్మీకాంత్ రెడ్డి నుంచి విడతలవారీగా సుమారు కోటి రూపాయలకు పైగా డబ్బును వసూలు చేసింది.తన ఆర్థిక అవసరాలు తీరిన తర్వాత సౌమ్య తన అసలు రంగు బయటపెట్టింది. లక్ష్మీకాంత్ రెడ్డి నంబర్‌ను బ్లాక్ చేసి, అతని నుంచి పూర్తిగా దూరం జరిగింది. అంతేకాకుండా, తన లాయర్‌తో మాట్లాడించి, ఇకపై తమకు కాల్ చేయవద్దని లక్ష్మీకాంత్ రెడ్డిని బెదిరించినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వీళ్లంతా ఆమె ఏర్పాటు చేసుకున్న ఫేక్ మనుషులేనని లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.ఇదే తరహాలో రాజేష్ అనే మరో యువకుడిని వలలో వేసుకుంది. అతన్ని ప్రేమ పేరుతో నమ్మించి, లక్షలాది రూపాయలు కాజేసింది. రాజేష్ డబ్బు అడగడం ప్రారంభించగానే, అతనిపైనే బెదిరింపులకు దిగడం మొదలుపెట్టింది.సౌమ్యా శెట్టి మోసాలు, బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక బాధితులైన లక్ష్మీకాంత్ రెడ్డి, రాజేష్ ఇద్దరూ విశాఖపట్నం పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని, మోసానికి గురైన తమ డబ్బు తిరిగి ఇప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా ద్వారా అమాయకులను మోసం చేస్తున్న సౌమ్యా శెట్టిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.కేవలం హానీ ట్రాప్ కేసులే కాకుండా, సౌమ్యా శెట్టిపై గతంలో విశాఖపట్నంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఈమె ఒక పోస్టల్ ఉన్నతాధికారి కుమార్తె , ఆమె స్నేహితురాలి ఇంట్లో జరిగిన దొంగతనంలో ప్రధాన నిందితురాలుగా ఉంది.

