If you are a man, don’t trample my movie.. hang my son!

కిరణ్ అబ్బవరం.. తనదైన శైలిలో విభిన్న పాత్రలలో నటిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నారు ఈ యంగ్ హీరో. రాజు వారు రాణిగారు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే ‘క ‘చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. అయితే దానికి తర్వాత వచ్చిన ‘దిల్ రూబా’ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ఒక సాలిడ్ హిట్ కొట్టాలనే ధ్యేయంతో “K-ర్యాంప్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ చిత్రంతోనే జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం అవ్వగా.. కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి కుమార్, నరేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించగా అక్టోబర్ 18న దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మాత రాజేష్ దండ నిర్మించారు. మొదటి షో నుంచే పాజిటిక్ టాక్ తో హిట్ కొట్టింది ఈ మూవీ. మూడు రోజుల్లో రూ. 17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించినట్టు మూవీ యూనిట్ సైతం ప్రకటించింది. ఈ మేరకు సక్సెస్ మీట్ గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, SKN, డైరెక్టర్స్ శ్రీను వైట్ల, సాయి రాజేష్, వశిష్ఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. నిర్మాత రాజేష్ ఓ వెబ్ సైట్ మీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మాత్రం ట్విట్టర్‌లో తమ సినిమా మీద దుష్ప్రచారం చేస్తుంది అంటూ రాజేష్ దండ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆవేశంలో కొన్ని బూతులను సైతం సదరు వెబ్ సైట్ నిర్వహకుడిని ఉద్దేశిస్తూ అనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉరి తీయాలి.. నా కొ**ని.. రాజేష్ ఏమన్నారంటే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. అయినా సరే ఒక వెబ్ సైట్ ఇంకా ఏడుస్తూనే ఉంది. అమెరికాలో ఉన్న వాడికి చెప్తున్నా.. పగలగొడతా.. నీకేం తెలుసురా లుచ్చా నా కొ*కా.. ‘డ్యూడ్’ సినిమాకి 190K, నా సినిమాకి 46K అని ఏవేవో కలెక్షన్స్ వేస్తున్నావ్. అది తెలుగు, తమిళం కలిపిరా కుక్కా.. సినిమాని తొక్కుతావా. నువ్వు మగాడివైతే తొక్కురా.. ఒక మొగోడిగా చెప్తున్నా. ఒక్క హిట్టు సినిమాని తొక్కేయాలని వీడు ఇంకా ఇలాంటి ఆర్టికల్స్ వేస్తున్నాడు. ఈ నా కొ*కుని ఏం చేయాలి.. నడిరోడ్డు మీద వీడ్ని ఉరి తీయాలి. మా మీద బతికే నా కొ*కా” అంటూ మండిపడ్డారు. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.













Leave a Reply

Your email address will not be published. Required fields are marked *