ఒక అబ్బాయి పదే పదే ఇలా చేస్తుంటే.. శృంగారం కోసమే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని అర్థం..!
ఈరోజుల్లో యువత డేటింగ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ అవతల వ్యక్తి ఏ ఉద్దేశంతో డేటింగ్ చేయాలనుకుంటున్నారో తెలుసుకోవడం కష్టం అయిపోతుంది. కొందరు నిజమైన ప్రేమ కోసం చూస్తుంటే మరికొందరు కేవలం శృంగారం కోసమే డేటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో జాయిన్ కావచ్చు.
సీరియస్ రిలేషన్షిప్ కోసం చూస్తున్న అమ్మాయిలు వీళ్లకు దూరంగా ఉండటమే మంచిది. అయితే ఒక వ్యక్తి కేవలం శృంగారం కోసమే డేటింగ్ చేస్తున్నాడని అమ్మాయిలు కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో చూద్దాం.

డేటింగ్ ప్రొఫైల్‌లో సెక్సువల్ ఫ్రేజెస్
శృంగారం కోసమే చూస్తున్న వ్యక్తి తన డేటింగ్ ప్రొఫైల్‌లో సెక్సువల్ ఫ్రేజెస్ ఉపయోగించవచ్చు. కొంతమంది డైరెక్ట్‌గా ఈ విషయాన్ని చెప్పేస్తారు. ఉదాహరణకు “నేను హుక్ అప్స్ కోసం చూస్తున్నా.”, “రాత్రి గడపడానికి ఎవరైనా కావాలి” వంటివి. మరికొంతమంది ఇన్‌డైరెక్ట్‌గా శృంగారం కోరికలను తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతారు. ఉదాహరణకు “నేను కేవలం ఫన్ కోసం చూస్తున్నా.”, “సీరియస్‌గా రిలేషన్షిప్ కోసం చూడటం లేదు” వంటివి మెన్షన్ చేస్తారు.

చాటింగ్ కాదు, సెక్స్టింగ్
కొందరు మగాళ్లు డేటింగ్లో టైమ్ వేస్ట్ చేసుకోకూడదనుకుంటారు. పరిచయమయ్యే మహిళ సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉందా, సెక్స్ చేయడానికి త్వరగా ఒప్పుకుంటుందా? అనేది తెలుసుకోవడానికి చాలా తక్కువ టైమ్‌లోనే సెక్స్ చాట్ మొదలు పెడతారు. నార్మల్ చాటింగ్ కాకుండా సెక్స్టింగ్ మాత్రమే చేస్తుంటారు.
శృంగారానికి నో చెప్తే కోప్పడతారు
ఓన్లీ సెక్స్ కోసం చూసేవారు మహిళ లైంగిక సంబంధానికి నిరాకరిస్తే, కోప్పడతారు. మాట్లాడటం మానేయవచ్చు కూడా. మంచి పరిచయం ఏర్పడినా కూడా తన కోరిక తీర్చుకోలేనని తెలుసుకున్న వెంటనే వెళ్లిపోతారు.
లక్ష్యం అది మాత్రమే!
చాలా మంది మహిళలు తమ డేటింగ్ పార్ట్నర్ గోల్స్ ఏమిటో, దాని గురించి ఎలా అడగాలో తెలియదు. అలాంటప్పుడు “నేను నిన్ను ఒక వ్యక్తిగత ప్రశ్న అడగొచ్చా? మీరు ఈ రిలేషన్షిప్ నుంచి ఏం కోరుకుంటున్నారు?” అని పూర్తి నిజాయితీగా ప్రశ్నించాలి. దానికి బదులుగా ఓన్లీ సెక్స్ లేదా క్యాజువల్ రిలేషన్షిప్స్ కోసం చాలా మందితో డేటింగ్ చేస్తున్నానని చెప్పవచ్చు. ఒక సీరియస్ రిలేషన్షిప్ కోసం చూస్తున్నానని కూడా అతడు చెప్పవచ్చు. ఏది తెలుసుకోవాలన్నా ప్రశ్నించడం ముఖ్యమని గుర్తించాలి.
నచ్చినప్పుడే కలవడం
సెక్స్ మాత్రమే కావాలనుకునే యువకులు యువతికి సమయం కేటాయించరు. ఎల్లప్పుడూ చాలా బిజీగా ఉంటారు. వారికి సాధ్యమైనప్పుడు, నచ్చినప్పుడే ఆమెను కలుస్తారు.

News by : V.L
