దారుణంగా హోటల్ కిచెన్.. అధికారుల తనిఖీల్లో వెల్లడి..!

హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతోన్నాయి. డిసెంబరు 11న మాదాపూర్ లోని పలు స్వీట్ షాపుల్లో తనిఖీలు చేసింది. అలాగే జూబ్లీహిల్స్‌లోని బెజవాడ భోజనం, మాదాపూర్‌లోని ఆరంభం (మిల్లెట్ ఎక్స్‌ప్రెస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్)లో ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘించినట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. అలాగే బెజవాడ భోజనం, ప్రఖ్యాత డైనింగ్ డెస్టినేషన్ ప్రాథమిక ఆహార భద్రత లోపించినట్లు తేలింది.
గడువు ముగిసిన టోన్డ్ మిల్క్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆహారానికి సరిగ్గా లేబుల్ చేయలేదని తేల్చారు. ఆరంభంలో లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రూ.21,893 విలువైన ఆహార పదార్థాలను సీజ్ చేసిన చేశారు. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 2017లో ప్రముఖ హార్ట్‌కప్ కాఫీ రెస్టారెంట్ అండ్ బార్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అధికారులు వంటగదిలో ప్రత్యక్ష బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.అలాగే చెత్తాచెదారం కూడా ఉన్నట్లు తేల్చారు. కిచెన్ ఫ్లోర్ సీలింగ్ సరిగా లేనట్లు చెప్పారు. వంటగది గోడలు చాలా కాలం వరకు సరైన శుభ్రపరచడం తెలుస్తోంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ జిడ్డుగా, అపరిశుభ్రంగా ఉంది. 6 కిలోల కిస్సాన్ టొమాటో గుజ్జు, 10 కిలోల వనస్పతి, 1 కిలోల ఒరేగానో, 8 కిలోల పెరి మెరినేడ్ వంటి గడువు ముగిసిన ఉత్పత్తులను అధికారులు గుర్తించారు. దీంతో పాటు టమాటాలు, బంగాళదుంపలు వంటి కూరగాయలు కూడా గడువు ముగిసినట్లు గుర్తించారు.సం, చికెన్, మటన్ వంటి మాంసాహార వస్తువులను అపరిశుభ్రంగా రిఫ్రిజిరేటర్‌లో పడేసినట్లు గుర్తించారు. రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రంగా ఉందని పేర్కొన్నారు. నీటి విశ్లేషణ నివేదికలు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు, ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ & సర్టిఫికేషన్ (FoSTaC) సర్టిఫికేట్‌లను రెస్టారెంట్ కార్మికులు అందించలేదని చెప్పారు.

