
జీవితం లో అనేక సవాళ్లను ఎదుర్కోoటాము. ఉదా:ఉద్యోగ ఒత్తిడి, ఇంట్లో ఇబ్బంది లేదా అనారోగ్యం మొదలగునవి. ఒత్తిడుల మద్య ఆనందంగా, సానుకూలంగా ఉండటం ఒక వరం. ప్రతి రోజు ఉదయం ఆశావాదం మరియు శక్తితో ప్రారంబించాలి. రోజు ప్రారంభం మీ ఉత్పాదకత మరియు విజయంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.. సరైన విధంగా రోజును ప్రారంభించడం ద్వారా మిమ్మల్ని మీరు విజయవంతం చేసుకోండి.
ఈ క్రింది సాధారణ వ్యూహాలను సంప్రదించడం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు.

ప్రతిరోజు త్వరగా నిర్ణిత సమయంలో నిద్ర పొండి:
ఉదయం నిద్రలేవడానికి మొదటి మెట్టు ముందు రోజు రాత్రి త్వరగా పడుకోవడం. నిద్ర ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య ఉండాలని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీ సాయంత్రం కార్యకలాపాలను త్వరగా నిర్వహించండి. నిద్రవేళకు కనీసం ఒక గంట ముందు ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని ఆపాలి.
Designed by : VL

