Horoscope Today: నేటి రాశి ఫలాలు… ఈ రాశుల వారు శుభవార్తలు ఎక్కువగా వింటారు… మీరున్నారా మరి!

rasi Phalalu 7-07-2025: పన్నెండు రాశుల్లో ఇవాళ (7 జూన్ 2025 సోమవారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. Rasi Phalalu 7-07-2025: పన్నెండు రాశుల్లో ఇవాళ (7 జూన్ 2025 సోమవారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ వృద్ది చెందుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో బాధ్యతలను, లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో చిన్నా చితకా సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధుమిత్రులకు ఆర్థిక సహాయం అందజేస్తారు. తల పెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు ఫలించి, ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. బంధు వుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి సఫలం అవుతారు. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు సోంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. విద్యార్థులకు గుర్తింపు లభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో చేపట్టిన కీలక మార్పులు లాభాలను తీసుకు వస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆదాయానికి లోటుండదు. ఖర్చులు తగ్గించు కోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. అనారోగ్యాల నుంచి కొద్దిగా కోలుకునే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అనుకోకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొద్దిగా పని ఒత్తిడి తగ్గుతుంది. అధికారులతో సామరస్య వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రయాణాల బాగా లాభిస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవ హారాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. రావలసిన సొమ్ము వసూలవుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. మంచి పరి చయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది.

