హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపు .. కుట్ర వెనుక ప్లాన్ ఎవరిదంటే?

Trisha: తమిళనాడులో వరుసగా బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలోని ప్రముఖులకు ఈ బెదిరింపులు అందుతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ నివాసానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో చెన్నై పోలీసులు హై అలర్ట్ మోడ్‌లోకి వెళ్లారు. త్రిష నివాసం సెనోటాఫ్ రోడ్‌లో ఉంది, ఇది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇల్లు ఉన్న చిత్తరంజన్ రోడ్‌కు సమీపంలో ఉన్న ప్రాంతం. దీంతో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
గురువారం (అక్టోబర్ 2) సాయంత్రం నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం త్రిష ఇంటికే కాకుండా, సీఎం స్టాలిన్ నివాసం, రాజ్‌భవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వంటి కీలక ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. వెంటనే చెన్నై పోలీసులు బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించి అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు గుర్తించబడకపోవడంతో ఊపరిపీల్చుకొన్నారు.
త్రిష ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాల్లో బిజీగా ఉన్న టాప్ హీరోయిన్. ఆమె ఇంటికి వచ్చిన బెదిరింపు కాల్ సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఈ కాల్స్ రాజకీయ, సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్న కుట్ర కావొచ్చా? తుంటరి వ్యక్తుల పనినా? అని పోలీసులు దృష్టి పెట్టారు.
ఇటీవల తమిళనాడులో ఇలాంటి బెదిరింపులు పెరుగుతున్నాయి. జూలై 27న కూడా సీఎం స్టాలిన్ ఇంటికి బాంబ్ బెదిరింపు కాల్ రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. ఈసారి కూడా నిందితులను గుర్తించడానికి సైబర్ క్రైమ్ టీమ్ రంగంలోకి దాఖలయింది. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని, అన్ని సురక్షిత చర్యలను తీసుకుంటుందని అధికారికంగా ప్రకటించింది.
త్రిషా కృష్ణన్ (Trisha Krishnan) దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్రహీరోయిన్ గా కొనసాగుతోంది. 1983 లో చెన్నైలో జన్మించిన త్రిషా చిన్నతనంలోనే మోడలింగ్, స్కూల్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. సినిమాలపై ఆసక్తితో 2000 లో ‘జెన్నా’ అనే (తమిళ్) సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది, తరువాత పలు హిట్టింగ్ తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది.

