పెరుగుతున్న గుండె పోటు మరణాలు.. కాపాడటానికి సింపుల్ టిప్స్ ఇవే!

ప్రస్తుతం చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. రోజు రోజుకు గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. యువతలోనే కాకుండా ఈ మధ్య చిన్న పిల్లలు కూడా గుండె పోటుతో మరణిస్తున్న విషయం తెలిసిందే. అయితే గుండెపోటు సమయంలో ఒక వ్యక్తిని ఎలా కాపాడాలో కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా చెప్పారు. కాగా, ఆ టిప్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రోజు రోజుకు గుండె పోటు మరణాలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. ఎంతో మంది స్ట్రోక్ బారినపడి ఆకస్మికంగా ప్రాణాలు విడుస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది యువత ఉన్నట్లుండి కుప్పకూలిపోయి ప్రాణాలు విడుస్తున్నారు. అయితే ఒక వ్యక్తికి గుండెపోటు వస్తే వైద్య సదుపాయం అందుబాటులో లేనప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలంట. ముఖ్యంగా వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి కొన్ని దశలు చెప్పారు అవి ఏవంటే?
మొదటి దశలో, ముందుగా రోగి చుట్టూ ఎవరూ గుమిగూడకూడదు. ఆ వ్యక్తికి చల్లగా గాలి తగిలేలా చేయాలి. దీని వలన గాలి లోపలికి చొచ్చుకపోయి, రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తగ్గుతుందంట. రెండవ దశలో రోగిని పక్కన పడుకోబెట్టి, కాళ్లను వ్యతిరేక దిశలో చాచి పడుకోబెట్టాలి. తర్వాత అతని పక్కన కూర్చొని ఛాతిపై రెండు చేతులతో గట్టిగా ప్రెస్ చేయాలి. దీని వలన ధమనులలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ప్రమాదం తగ్గుతుంది. CPR సమయంలో, రోగి ఛాతీని దాదాపు 100 నుండి 120 సార్లు గట్టిగా నొక్కాలంట. సకాలంలో సీపీఆర్ చేస్తే వ్యక్తి ప్రాణం కాపాడే అవకాశం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మూడు దశలో, స్టెర్నమ్ అనేది కనీసం 3 నుంచి 6 అంగుళాలు ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇలా చేసే క్రమంలో రోగి పక్కటెముకలు పగులు లేదా ఇతర ఇబ్బందులు అనుభవించినప్పటికీ అంతగా ప్రమాదం లేదు. ఆ సమస్య తర్వాత త్వరగా నయం చేయవచ్చు అని చెబుతున్నారు వైద్య నిపుణులు.
నాలుగవ దశలో, సీపీఆర్ చేస్తున్న క్రమంలో, ఎలాంటి ఫలితం లేకుండా, వారి రంగు మారడం ప్రారంభమైతే, ముఖ్యంగా నీలం లేదా ముదురు రంగులో శరీరం, ముఖం కనిపిస్తే అతని మరణానికి దగ్గరగా ఉన్నట్లేనంట. ఒక వేళ వ్యక్తి శరీరం ఎప్పటిలా మారుతూ ఉంటే ఆ వ్యక్తి కోలుకుంటున్నట్లు అని అర్థం.
ఐదవ దశ వచ్చినప్పుడు కొందరు సీపీఆర్ చేయడం ఆపేస్తారు. కానీ అలా చేయకూడదంట, వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి ఒక్క నిమిషం పాటీ సీపీఆర్ చేస్తే సరిపోకపోవచ్చును, కొన్ని సార్లు మీ ప్రయత్నం ఆపకుండా రెండు , మూడు నిమిషాల పాటు చేస్తూనే ఉండాలంట. ఇక ఆరవ దశకు వచ్చే సరికి, గుండెపోటు వచ్చిన వ్యక్తి ఐదు నుండి పది నిమిషాలలోపు కోలుకోకపోతే, వారు మరణించారని స్పష్టమవుతుందంట.

