ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు.. మహిళలకు ఇవి వరం లాంటివి..!

ఖర్జూరం రుచి, ఆరోగ్యానికి ఉత్తమం. ఖర్జూరాలు శక్తి, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం, ఎముకల బలం, చర్మం, బరువు తగ్గడం, హిమోగ్లోబిన్ పెంపు వంటి అనేక లాభాలు కలిగిస్తాయి. రుచికి రారాజు ఖర్జూరమని అంటారు.. ఇది కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉత్తమం. ఆయుర్వేదం ఖర్జూరాలను ఆరోగ్యానికి మహా మంచి అని చెప్పింది. ఇందులో ఉడే సహజ చక్కెర, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఈ డ్రైఫ్రూట్ ముఖ్యంగా మహిళలకు విస్తారంగా లాభం చేకూరుస్తుంది.
రోజంతా బిజీగా గడిపే మహిళలకు వెంటనే శక్తి అవసరం అవుతుంది. ఖర్జూరాల్లో ఉండే నేచురల్ షుగర్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మరింత లాభం అంటారు. అంతేకాకుండా ఖర్జూరాల్లో ఉన్న అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గి జీర్ణక్రియ సులభం అవుతుంది.మహిళల ఆరోగ్యానికి రోగనిరోధక శక్తి ఎంత అవసరమో చెప్పాల్సిన పని లేదు. ఖర్జూరాల్లో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. గుండె ఆరోగ్యం కోసం ఖర్జూరాల్లో ఉండే పొటాషియం ఎంతో అవసరం. ఇది రక్తపోటును నియంత్రించి గుండె స్పందన రేటును సమతుల్యం చేస్తుంది.
ఎముకల బలానికి ఖర్జూరాలు మరింత తోడ్పడతాయి. వయసుతోపాటు మహిళల్లో ఎముకల బలం తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరాల్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా మహిళలకు చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండడం కోసం ఖర్జూరాలు రహస్య ఆయుధం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రభావాలను తగ్గించి చర్మానికి తారుణ్యం అందిస్తాయి. చర్మం కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది.తక్కువ కాలంలో ఆకలి తీరిపోకుండా ఉంచే గుణం ఖర్జూరాలకు ఉంది. కాబట్టి బరువు తగ్గాలని భావించే మహిళలకు ఖర్జూరాలు ఉపయుక్తం. అధిక ఫైబర్ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీనివల్ల అతిగా తినే అలవాటు తగ్గుతుంది.ఖర్జూరాలను డైట్లో చేర్చడం చాలా సులభం. ప్రతిరోజూ 3-4 ఖర్జూరాలను పాలతో లేదా.. ఖాళీ కడుపుతో తింటే శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. బాదం, వాల్ నట్స్ వంటి డ్రైఫ్రూట్స్‌తో కలిపి తింటే పోషక విలువలు రెట్టింపు అవుతాయి. స్మూతీలు, ఓట్స్, డెజర్ట్స్కి కూడా ఖర్జూరాలను జోడించవచ్చు.

