సీనియర్ హీరోయిన్ గౌతమి కూతురిని చూశారా..? ఇంత అందంగా ఉందేంట్రా బాబూ..

ఒకప్పటి తెలుగు హీరోయిన్లు తమ అందచందాలతో అప్పటి తరాన్ని ఉర్రూతలూగించగా.. ఇప్పుడు వారి పిల్లలు అంతకుమించి అనేలా అందంతో అట్రాక్ట్ చేస్తున్నారు. ఆ లిస్టులోనే ఉంది సీనియర్ హీరోయిన్ గౌతమి కూతురు.ఒకప్పటి తెలుగు హీరోయిన్లు తమ అందచందాలతో అప్పటి తరాన్ని ఉర్రూతలూగించగా.. ఇప్పుడు వారి పిల్లలు అంతకుమించి అనేలా అందంతో అట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ తారల కూతుళ్లు సినీ ఎంట్రీ ఇవ్వగా ఇంకొందరు మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇదే బాటలో వెళుతోంది సీనియర్ నటి గౌతమి కూతురు సుబ్బలక్ష్మి.తెలుగు, తమిళ భాషల్లో 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది నటి గౌతమి. తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తెలుగులో శ్రీనివాస కళ్యాణం, బెజవాడ రౌడీ, భార్యా భర్తలు, తోడల్లుడు, నేటి చరిత్ర, బామ్మ మాట బంగారు బాట, చైతన్య, అన్నా, చిలక్కొట్టుడు వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది.అప్పట్లో ఆమె సౌత్‌లోని అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. హీరోయిన్‌గానే కాకుండా, ఆ తర్వాత కాలంలో మనమంతా, శాకుంతలం, స్కంద, అన్నీ మంచి శకునములే వంటి చిత్రాల్లో సైడ్ యాక్టర్ గా కూడా తన పాత్రలను అద్భుతంగా పోషించి మెప్పించింది.కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే గౌతమి తన వ్యక్తిగత జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 1998లో ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఏడాదికే వీరికి సుబ్బలక్ష్మి అనే అందమైన కుమార్తె జన్మించింది. అయితే, కొన్ని కారణాల వల్ల గౌతమి, సందీప్ భాటియా విడిపోయారు. వారి వివాహబంధం ఎక్కువ కాలం నిలవలేదు.
ఆ తర్వాత, 2004 నుండి 2016 వరకు తమిళ నటుడు కమల్ హాసన్ తో కలిసి సహజీవనం చేసింది గౌతమి. కానీ, ఆ బంధం కూడా చివరికి ముగిసింది. ఇక జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న గౌతమి, ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధిని జయించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం గౌతమి సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు.
అయితే, ఇప్పుడు గౌతమి కంటే కూడా ఆమె కూతురు సుబ్బలక్ష్మి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల గౌతమి పలు కార్యక్రమాలకు తన కూతురు సుబ్బలక్ష్మిని తీసుకురావడం, ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సుబ్బలక్ష్మి తల్లికి ఏమాత్రం తీసిపోని విధంగా అందంగా ఉందని, ఆమె ముఖంలో తల్లి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
సుబ్బలక్ష్మి ఫోటోలకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే తన ఉన్నత చదువులను పూర్తి చేసుకున్న సుబ్బలక్ష్మి, త్వరలోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. తల్లి గౌతమి కూడా తన కూతురిని సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గౌతమి కూతురుగా ఆమెకు సినిమా రంగంలో అడుగుపెట్టడం సులభమే అయినప్పటికీ, నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం ఆమెకు పెద్ద సవాల్ అవుతుందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా, గౌతమి కూతురు సుబ్బలక్ష్మి సినీరంగ ప్రవేశం అనే పాయింట్ మాత్రం ప్రేక్షకులు ఆసక్తికరంగా మారింది.

