Hair Repair: జుట్టు మొత్తం రఫ్‌గా తయారైందా?.. దీన్ని పెరుగుతో కలిపి అప్లై చేస్తే సిల్కీగా అవ్వాల్సిందే!

ఈ సమస్యను నివారించేందుకు, జుట్టును సిల్కీగా ఉంచేందుకు సహజ పదార్థాలతో చేసిన హెయిర్ మాస్క్‌ను ప్రయత్నించవచ్చు. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. ఇంట్లో ఉన్న రెండు పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ సహజ హెయిర్ మాస్క్‌ను ఎలా ఉపయోగించాలో, తయారు చేయాలో చూసేద్దాం.
జుట్టును సిల్కీగా చేయడానికి అరటిపండు పెరుగుతో చేసిన హెయిర్ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. ఈ రెండు పదార్థాలకు ఉన్న లక్షణాలు జుట్టును రిపేర్ చేయడానికి సహాయపడతాయి. అరటిపండు జుట్టును బలోపేతం చేస్తుంది. పొడి జుట్టు సమస్యను తగ్గిస్తుంది. అలాగే, జుట్టుకి మెరుపును కూడా ఇస్తుంది. పెరుగులో ప్రోటీన్, విటమిన్లు. కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. పెరుగు వాడటం వల్ల నెత్తిని శుభ్రపరుస్తుంది. దురద సమస్యను తగ్గిస్తుంది. పెరుగుతో చేసిన హెయిర్ మాస్క్ వాడటం వల్ల జుట్టు సిల్కీగా, మెరిసేలా ఉంటుంది.

News by : V.L
