GST Rate: GST reduction starts tomorrow.. Prices of 375 items will be reduced.. This is the full list

GST Rate: వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచే మొదలవుతోంది. కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత మొత్తం 375 రకాల వస్తువులు, ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. డైరీ ఉత్పత్తులు, కార్ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పటికే ఆయా కంపెనీలు ధరల తగ్గింపు ప్రకటనలు చేశాయి. మరి అందులోని ముఖ్యమైన వస్తువుల జాబితా ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

GST Rate: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) సంస్కరణలు సెప్టెంబర్ 22, 2025 నుంచే అమలులోకి వస్తున్నాయి. ఈనెల మొదటి వారంలో వస్తు సేవల పన్ను మండలి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 5, 18 శాతం పన్ను శ్లాబులను కొనసాగిస్తూ 12, 28 శ్లాబులను తొలగించింది. దీంతో సెప్టెంబర్ 22 నుంచి 5, 18 శాతం పన్ను శ్లాబులే అమలు అవుతాయి. దీంతో ఏకంగా 375 రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ జాబితాలో డైరీ ప్రొడక్ట్స్, కార్లు, ఔషధాలు, వంట సామగ్రి నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు చాలా కేటగిరీల వస్తువులు ఉన్నాయి. ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయి? ముఖ్యమైన వాటి జాబితా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆహార పదార్థాలు

ఆహార పదార్థాల జాబితాలో పాలతో ఉన్న పానియాలు, ఘనీభవించిన పాలు, బిస్కెట్లు, కార్న్ ఫ్లేక్స్, సీరల్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ పల్ప్, ఫ్రూట్ జూస్, నెయ్యి, ఐస్ క్రీమ్, జామ్, ఫ్రూట్ జెలీస్, కెచప్, ఉప్పు, పనీర్, పాస్ట్రీ, మాంసం, ప్యాకేజ్డ్ కొబ్బరీ నీళ్లు ఉన్నాయి.

రోజు వారీ వస్తువులు..

షేవ్ లోషన్, ఫేస్ క్రీమ్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, షాంపూ, షేవింగ్ క్రీమ్, టాల్కమ్ పౌండర్, టూత్ బ్రస్, టాయిలెట్ సబ్బులు వంటివి ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్..

ఎయిర్ కండీషనర్లు, డిష్ వాషర్స్, టీవీలు, వాషింగ్ మెషన్స్ ఉన్నాయి.

ఔషధాలు..

డయాగ్నస్టిక్ కిట్లు, గ్లూకో మీటర్లు వంటి మెడికల్ డివైజులపై జీఎస్టీ 5 శాతానికి తగ్గుతుంది. దీంతో వాటి ధరలు తగ్గుతాయి. వాటిపై ఎంఆర్‌పీ ధరలను తగ్గించాలని కేంద్రం ఫార్మసీలను ఆదేశించింది.

బ్యూటీ, ఫిజికల్ సర్వీసెస్‌లో

బార్బెర్స్, ఫిట్‌నెస్ సెంటర్స్, హెల్త్ క్లబ్స్, సెలూన్స్, యోగా కేంద్రాల వంటి వాటిపై జీఎస్టీ తగ్గుతుంది. వాటి ధరలు దిగివస్తాయి.

ఇంటి నిర్మాణ ఖర్చులు

ఇంటి కొనుగోలుదారులు లేదా నిర్మాణదారులకు జీఎస్టీ ద్వారా భారీగా ప్రయోజనం కలగనుంది. సిమెంట్ ధరలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీంతో నిర్మాణ ఖర్చు భారీగా తగ్గనుంది.

ఆటోమొబైల్స్

కార్లు, ఇతర వాహనాలపై జీఎస్టీ భారీగా తగ్గుతుంది. ఇంతకు ముందు పన్నులు సెస్ ‌తో కలిపి 35 శాతం నుంచి 50 శాతం వరకు ఉండేవి. ఇప్పుడు ఫ్లాట్ 40 శాతం గా మార్చారు. సెస్ ఎత్తివేశారు. దీంతో గరిష్ఠ పన్ను ఇదే. అలాగే చిన్న కార్లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు. ఇప్పటికే మారుతీ, టాటా వంటి కంపెనీలు ధరల తగ్గింపు ప్రకటనలు చేశాయి.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *