GST changes: Changes in GST rules from October 1st.. Final deadline extended

GST changes: కొత్త నెల వస్తుందంటే ఎన్నో విషయాల్లో మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా మనీ మ్యాటర్స్‌లో ఈ మార్పులు వస్తుంటాయి. ఈ మ్యానీ మ్యాటర్స్ విషయంలో ఈసారి జీఎస్టీ కూడా నిలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి జీఎస్టీలో కూడా చట్టపరమైన మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులతో ట్యాక్స్ కంప్లియెన్స్ సిస్టమ్‌ను కేంద్రం బలోపేతం చేస్తుంది. అంతేకాక క్లయిమ్స్ దాఖలుకు సంబంధించి కేంద్రం అదనపు సమయాన్ని అందిస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా పన్ను వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ సారి కూడా ఖజానా ఘల్ ఘల్ మనే అవకాశం ఉంది.

హైలైట్:

  • అక్టోబర్ 1 నుంచి జీఎస్టీలో కూడా మార్పులు
  • ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫైల్‌కి అదనపు సమయం
  • ట్యాక్స్ కంప్లియెన్స్‌ను బలోపేతం చేస్తున్న ప్రభుత్వం
  • జీఎస్టీ కలెక్షన్లు రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా

GST changes : గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(GST)కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలకపరమైన మార్పులు చేస్తోంది. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన ఆర్థిక చట్టంలో ఈ మార్పులను ప్రవేశపెట్టింది.తాజాగా సీబీఐసీ జారీ చేసిన ఆర్డర్‌లో ఈ విషయాన్ని మరోసారి పేర్కొంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు సంబంధించి క్లయిమ్స్ ఫైల్ చేసుకునేందుకు అదనపు సమయాన్ని కేటాయిస్తూ ఈ మార్పులు చేసింది. ట్యాక్స్ కంప్లియెన్స్‌ను బలోపేతం చేసేందుకు ఈ మార్పులు చేపడుతోంది.

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని పొందేందుకు సెప్టెంబర్ 30లో దాఖలు చేయాల్సిన జీఎస్టీ రిటర్నుల గడువును నవంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. అదేవిధంగా క్రెడిట్ నోట్ల జారీ, రిటర్నుల డిక్లరేషన్‌ను కూడా సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 30 వరకు పొడిగించింది.

వ్యాపారులు ఈ మార్పులు గురించి తెలుసుకుని, వారి ప్రాసెస్‌ను దానికి అనుగుణంగా మార్చుకోవాలని కేపీఎంజీ ఇండియా ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ పార్టనర్ అభిషేక్ జైన్ తెలిపారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సస్ అండ్ కస్టమ్స్( CBIC ) గత ఆర్థిక సంవత్సరానికి చెందిన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందే సమయ వ్యవధిని, క్రెడిట్ నోట్ల జారీని, జీఎస్టీ రిటర్నులు సరిదిద్దుకునే ప్రక్రియల తుది గడువును సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 30కి పొడిగించిందని ఈవై ట్యాక్స్ పార్టనర్ సౌరభ్ అగర్వాల్ అన్నారు. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.







		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *