ఖైదీలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్..జైళ్లలో శృంగారం చేసుకోవడానికి గదులు ఏర్పాటు . . .

శృంగారం అనే పదం వినగానే మనకు ఎన్నో రకాల భావాలు కలుగుతాయి. ప్రేమ, అనుబంధం, ఆకర్షణ, సంతోషం, మరియు అనేక ఇతర భావాలు మన మనసుల్లో ఉద్భవిస్తాయి. శృంగారం అనేది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు, ఇది మానసిక, భావోద్వేగ సంబంధమైన ఒక అనుభూతి. శృంగారం ఒక సహజమైన ప్రక్రియ. ఇది అందరి జీవితాల్లో సర్వసాధారణంగా జరిగేదే. అయితే జైల్లో ఖైదీలు సంవత్సరాలు తరబడి ఈ శృంగారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే కొన్ని దేశాలు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాయి. జైళ్లో ఖైదీలుగా ఉన్న వారు తమ జీవిత భాగస్వామిని ఏకాంతంగా కలుసుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో జైళ్లలో ఖైదీల కోసం ప్రత్యేకంగా ‘సెక్స్ రూమ్స్’ సౌకర్యం ఉంది. దీని ద్వారా ఖైదీలకు వారి జీవిత భాగస్వాములతో వ్యక్తిగతంగా సమయం గడపడానికి అవకాశం దొరికినట్టు అవుతుంది.ఇటలీ తన మొట్టమొదటి అధికారిక “సెక్స్ రూమ్”ను ఉంబ్రియా ప్రాంతంలోని ఒక జైలులో ప్రారంభించింది. ఖైదీల యొక్క “సన్నిహిత సమావేశాల” హక్కును రాజ్యాంగ న్యాయస్థానం గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ గదిలో ఒక మంచంతో పాటు టాయిలెట్ ఉంటాయి. గార్డుల పర్యవేక్షణ లేకుండా ఖైదీలు తమ భాగస్వాములతో గరిష్టంగా రెండు గంటల వరకు గడపవచ్చు.

News By : V.L
