Good news for women in AP.. Dwakra is completely free, you can earn Rs. 50 thousand to Rs. 70 thousand.

హైలైట్:

  • ఏపీ డ్వాక్రా మహిళలకు తీపికబురు
  • వచ్చే నెల నుంచి కొత్త పథకం
  • ప్రభుత్వమే ఉచితంగా ప్లాన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆదాయం పెంచడానికి మరో కొత్త పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలు వెదురు సాగు చేస్తారు.. వెదురు ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 10 వేల మంది మహిళలను వెదురు సాగు వైపు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే అధికారులు 2 వేల మందిని ఎంపిక చేశారు.

ఈ నెలాఖరుకు డ్వాక్రా మహిళలు 5 వేల మందిని ఎంపిక చేసి, వచ్చే నెల నుంచి సాగు మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వెదురు సాగులో సలహాలు, సహాయం అందించడానికి సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) ఇండస్ట్రీ ఫౌండేషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆహార పంటల ఉత్పత్తి తగ్గకుండా మొదట 30 సెంట్లలో వెదురు సాగు చేస్తారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కలు ఉచితంగా ఇస్తారు. అంతేకాదు, సాగుకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వెదురు రకాలతో పాటుగా త్రిపుర నుంచి బార్బుసా న్యూటన్స్, బార్బుసా టుల్డా అనే రెండు కొత్త రకాలను కూడా తెప్పిస్తున్నారు. మొదటి దశలో అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, నంద్యాల జిల్లాలలో ఈ సాగును ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో వెదురు ప్రాసెసింగ్ ప్లాంటును రూ.2 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్లాంటు చుట్టుపక్కల 450 ఎకరాల్లో గిరిజన మహిళలతో వెదురు సాగు చేయిస్తారు.. అలాగే యువతకు కూడా ఉద్యోగాలు లభిస్తాయి అంటున్నారు. వెదురు నాటిన తర్వాత నాలుగో సంవత్సరం నుంచి 40 ఏళ్ల వరకు ఆదాయం వస్తుంది అంటున్నారు సెర్ప్ అధికారులు. వెదురు నాటిన నాలుగో సంవత్సరం రూ.50 వేలు, ఐదో ఏడాది రూ.70 వేలు ఇలా ఏటా క్రమంగా ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. డ్వాక్రా మహిళలు వెదురు సాగు చేయడం ద్వారా డ్వాక్రా మహిళలు మంచి ఆదాయం పొందవచ్చు అంటున్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి అంటున్నారు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *