Good news for Tirumala Srivari devotees.. Another special train is available, it will stop at these stations

తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. తెలంగాణ నుంచి ప్రస్తుతం నడుస్తున్న రెండు ప్రత్యేక రైళ్లతో పాటు.. నాందేడ్ నుంచి తిరుపతికి ఆగస్టు నెలలో అదనంగా ఐదు ట్రిప్పుల ప్రత్యేక రైలును నడపనుంది. ఇది కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలులో జనరల్, ఏసీ, స్లీపర్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.

హైలైట్:

  • తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
  • అందుబాటులోకి మరో స్పెషల్ ట్రైన్
  • ఈ స్టేషన్లలో ఆగుతుంది
  • తెలంగాణ నుంచి రోజుకు సగటున వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడం వల్ల అధిక ఛార్జీలు, సుదీర్ఘ ప్రయాణ సమయం, శారీరక శ్రమ వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. రైలు ప్రయాణం సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఖర్చు తక్కువైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీంతో చాలా మంది భక్తులు రైళ్లపై ఆధారపడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం నడుస్తున్న రెండు ప్రత్యేక రైళ్లతో పాటు, నాందేడ్ నుంచి తిరుపతికి ఆగస్టు నెలలో అదనంగా మరో ఐదు ట్రిప్పుల ప్రత్యేక రైలును నడపనుంది.
  • ఈ ట్రైన్ కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. ఈ కొత్త ప్రత్యేక రైలు ఆగస్టు నెలలో ప్రతి శనివారం సాయంత్రం 4:50 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి.. కరీంనగర్ మీదుగా ప్రయాణించి ప్రతి ఆదివారం ఉదయం 11:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి.. కరీంనగర్ మీదుగా మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది.
  • నాందేడ్ నుంచి తిరుపతికి: ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో… తిరుపతి నుంచి నాందేడ్‌కు ఆగస్టు 3, 10, 17, 24, 31 తేదీల్లో ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక రైలు నాందేడ్ నుంచి తిరుపతికి వెళ్లే క్రమంలో కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు శనివారాల్లో రాత్రి 9:08 గంటలకు వస్తుంది. తిరుపతి నుంచి నాందేడ్‌కు వెళ్లే సమయంలో ఆదివారాల్లో ఉదయం 9:10 గంటలకు ఆగుతుందని రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ భానుచందర్ తెలిపారు. ఈ రైలులో జనరల్, ఏసీ, స్లీపర్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి.
  • ఈ ప్రత్యేక రైలు నాందేడ్ నుంచి బయలుదేరి ముడ్కేడ్, బాసర, నిజామాబాద్, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర, కొండపల్లి, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్ల మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ అదనపు రైలు భక్తుల రద్దీని తగ్గించి, వారికి మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెబుతున్నారు. టికెట్ల లభ్యత, సమయ వివరాల కోసం రైల్వే వెబ్‌సైట్‌ను లేదా రైల్వే విచారణ కేంద్రాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.


		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *