Good news for Amaravati farmers.. Allotment of plots to those who were given lands today..!

                     అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. భూములిచ్చిన వారికి ప్లాట్ల కేటాయింపు ఆరోజే..!

అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాజధానిలో ప్రతిష్టాత్మక సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు.. మలి విడత ప్లాట్ల కేటాయింపు ఈ నెల 29న జరగనుంది. రైతులకు పారదర్శక ఈ-లాటరీ విధానంలో స్థలాలను కేటాయించనున్నారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పెండింగ్‌లో ఉన్న ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కూడా 200పైగా రైతులకు ప్లాట్లు కేటాయించింది ప్రభుత్వం.

అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాజధాని నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానిక భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA) వేగవంతం చేసింది. మలి విడత ప్లాట్ల కేటాయింపును ఈ నెల 29న చేపట్టనున్నట్లు తెలిపింది. ఇటీవల కూడా 200పైగా మంది రైతులకు ఈ- లాటరీ విధానం ద్వారా ప్లాట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

కాగా, ఈ మలి విడత ప్లాట్ల కేటాయింపు ఈ నెల 28వ తేదీనే చేపట్టాల్సి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమాన్ని ఒక రోజు వాయిదా వేశారు అధికారులు. దీంతో ఈ నెల 29వ తేదీన ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు పారదర్శకంగా ఉండే ఈ-లాటరీ విధానం ద్వారా స్థలాలను కేటాయించనున్నారు. ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి.. సీఆర్డీఏ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top