Gold Rates: కుప్పకూలుతున్న బంగారం ధర.. 3 రోజుల్లో భారీ పతనం.. తులం రేటు ఎంతకు దిగొచ్చిందంటే?
old Rates: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరే శుభవార్త. వరుసగా మూడో రోజూ పసిడి ధరలు భారీగా పడిపోయాయి. మూడు రోజుల్లో భారీ పతనం అని చెప్పవచ్చు. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ మొదలైన క్రమంలో బంగారం ధరలు దిగిరావడం ఊరట కలిగించే విషయం. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడం ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో జూలై 27వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం రేటు ఎంత పలుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హైలైట్:
పసిడి ప్రియులకు అదిరే శుభవార్త
వరుసగా మూడో రోజూ తగ్గిన బంగార ధరలు
తులం రేటు ఎంతకు పడిపోయిందంటే?
Gold Rates: దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. బంగారం కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. ఇప్పటికే చాలా మంది బంగారు ఆభరణాలు కొనేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఇన్నాళ్లు బంగారం, వెండి రేట్లు ఆకాశమే హద్దుగా పెరుగుతూ ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులు, పలు దేశాల మధ్య యుద్ధాలతో అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలు విపరీతంగా పెరిగేందుకు కారణమయ్యాయి. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడం ధరలు పెరిగేలా చేసింది. తులం రేటు లక్ష మార్క్ దాటిపోయింది. అయితే, ఇప్పుడు వరుసగా పడిపోతూ అదిరే శుభవార్త చెబుతున్నాయి. బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయంగా చెప్పవచ్చు. పలు దేశాలతో అమెరికా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోవడం, యుద్ధాలకు తాత్కాలిక బ్రేకులు వంటి సానుకూల పరిస్థితులతో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లు జూలై 27వ తేదీన తులం బంగారం రేటు ఎంతుందో తెలుసుకుందాం.అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుపై 32 డాలర్ల మేర పడిపోయి 3336 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.07 శాతం మేర తగ్గి 38.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక భారత కరెన్సీ రూపాయి విలువ పడిపోతూ ఆందోళన కలిగిస్తోంది. డలర్తో పోలిస్తే ఇవాళ రూపాయి మారకం విలువ రూ.86.495 వద్ద ట్రేడవుతోంది.