Gold Rate: 10 రోజుల్లో బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఇలా తగ్గిపోతుంది ఏంటి భయ్యా..!

Gold Rate: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం గ్రాముకు ₹9,802, 22 క్యారెట్ బంగారం ₹8,985. వెండి గ్రాముకు ₹117.90. ఇరాన్-ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు తగ్గడం కారణం. ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గిపోవడం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపాయి. గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది ఊరట కలిగించే విషయం. అయితే జూన్ 27న హెదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? హైదరాబాద్ నగరంలో ఈరోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి: 24 క్యారెట్ బంగారం – గ్రాముకు ₹9,802, 22 క్యారెట్ బంగారం – గ్రాముకు ₹8,985, 18 క్యారెట్ బంగారం (999 ప్యూర్ గోల్డ్) – గ్రాముకు ₹7,352లు ఉన్నాయి. అయితే నిన్నటితో పోల్చుకుంటే 24 క్యారెట్ బంగారం ధరపైన రూ.93 తగ్గింది. దీన్ని బట్టి చూస్తే 10 గ్రాములపై రూ.930 తగ్గింది. ఇకపోతే 22 క్యారెట్ 10 గ్రాముల పసిడిపై రూ.850లు తగ్గింది. వెండి ధర కూడా కొంత మేర తగ్గింది. గ్రాముకు వెండి – ₹117.90, కిలో వెండి – ₹1,17,900.. వెండి ధరల్లో ఈ స్వల్ప మార్పు పెళ్లిళ్లు, ఆభరణాల కొనుగోలుదారులకు అలాగే పెట్టుబడిదారులకు ప్రాధాన్యత కలిగిన విషయం. ఇదిలా ఉండగా గడిచిన 10 రోజుల్లో పది గ్రాముల 24 గ్యారెట్ గోల్డ్ పైన రూ.2350లు తగ్గింది. దీంతో చాలా మంది బంగారం కొనేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఓ పక్క యుద్ధం ప్రభావం ఉన్నాసరే బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ఇదే కొనసాగితే గోల్డ్ రేట్స్ మరింత తగ్గే అవకాశం ఉంది. మెహతా ఎక్విటీస్ కమోడిటీస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి మాట్లాడుతూ..”ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో బంగారం ధర పెరిగే అవకాశం తగ్గింది. ప్రపంచ మార్కెట్ల పుంజుకోటంతో పాటు ఇది ప్రధాన కారణం,” అని వెల్లడించారు. ప్రపంచ బంగారం మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ధర $3,313.23కి తగ్గింది (0.4% తగ్గుదల). ఈ వారం మొత్తం మీద చూస్తే బంగారం ధరలో 1.7% తగ్గుదల కనిపించింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 0.7% తగ్గి $3,325.70 వద్దకు చేరింది. జూన్ 13న ఇజ్రాయిల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌లోని అణు, సైనిక కేంద్రాలపై తీవ్ర దాడులు జరిపింది. దీనికి ప్రతిగా ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు జరపడం వల్ల మార్కెట్లలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీని ప్రభావంతో బంగారం ధరలు బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా కుదుటపడడంతో ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. భారతదేశంలో బంగారం ధరలు చాలాచోట్ల మారుతూ ఉంటాయి. కానీ ఈ మార్పులు సాధారణంగా ఈ అంశాలపై ఆధారపడి ఉంటాయి: అంతర్జాతీయ బంగారం ధరలు, దిగుమతి సుంకాలు, కేంద్ర, రాష్ట్ర పన్నులు, రూపాయి మారకం విలువ (రూపీ-డాలర్ మార్పిడి రేటు), దేశీయ డిమాండ్, ఆఫర్, ప్రభుత్వ విధానాలు. భారతీయుల సంస్కృతిలో బంగారం కేవలం ఆభరణంగా కాకుండా, పెట్టుబడి రూపంగా కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. పండుగలు, వివాహాలు వంటి సందర్భాల్లో బంగారం కొనుగోలు అనివార్యం. దీనికి తోడు బంగారం విలువ కూడా పెరగడం వల్ల ఇది భద్రతగా భావిస్తారు. బంగారం ధరలు ప్రతి రోజు మారుతుండటం వల్ల, కొనుగోలు చేసేవారు ధరలపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలు చేసేవారు తాజా మార్కెట్ ధోరణి తెలుసుకుని ఆపై నిర్ణయం తీసుకోవాలి.

