Gold Jewellery Offers: బంగారం కొనే వారికి భారీ శుభవార్త.. రూ.60 వేల దాకా భారీ డిస్కౌంట్ ఆఫర్!

బంగారం కొనే వారికి పండుగ ఆఫర్లు అదిరిపోయాయి. భారీ డిస్కౌంట్ పొందొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.పండుగ వేళ బంగారం కొనే ప్లానింగ్‌లో ఉన్న వారికి భారీ శుభవార్త. అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కళ్లుచెదిరే తగ్గింపు పొందొచ్చు. గోల్డ్ జువెలరీ, సిల్వర్ నగలు వంటి వాటి కొనుగోలుపై మంచి ఆఫర్లు ఉన్నాయి. వివిధ జువెలరీ బ్రాండ్లు అదిరే డీల్స్ అందుబాటులో ఉంచాయి. అయితే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఏ ఏ జువెలరీ సంస్థ ఎలాంటి ఆఫర్లు అందిస్తోందో తెలుసుకుందాం.Anmol Jewellers – మీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ తో Anmol Jewellers వద్ద ప్రత్యేక ఆఫర్ పొందండి. C. Krishniah Chetty Group of Jewellers (CKC) – ఎంచుకున్న ఉత్పత్తులపై 20% ఫ్లాట్ తక్షణ తగ్గింపు పొందండి. CLEANOVO – మీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కన్జ్యూమర్, కార్పొరేట్ లేదా నెట్‌వర్క్ కార్డ్ తో CLEANOVO వద్ద 20% తగ్గింపు పొందండి.Isharya స్టోర్లలో 15% తగ్గింపు పొందండి. Joyalukkas – INR 6,000 ఫ్లాట్ తగ్గింపు ,మేకింగ్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపు పొందండి. ఇక్కడ ర.50 వేలు లేదా ఆపైన షాపింగ్ చేస్తేనే ఈ మేరకు డిస్కౌంట్ బెనిఫిట్ లభిస్తుంది. ట్రాన్సాక్షన్ ఆధారంగా తగ్గింపు విలువ మారొచ్చు. Kalyan Jewellers – కనీసం రూ. 75,000 లావాదేవీపై రూ. 60,000 వరకు తగ్గింపు పొందండి. మీ ట్రాన్సాక్సన్ అమౌంట్ ఆధారంగా డిస్కౌంట్ మారుతుంది. ఇంకా తయారీ చార్జాల్లో 35 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.Giva స్టోర్లలో వెండి ఆభరణాలపై 20% తగ్గింపు పొందండి. Rosa Amoris – ముంబైలోని Rosa Amoris జ్యువెలరీ బూటిక్‌లో మీ ఆభరణాల సేకరణకు మెరుపు చేర్చుకోండి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు- షాపింగ్, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్ , గిఫ్టింగ్‌లో భారీ తగ్గింపులు పొందండి. ప్రతి ఆఫర్‌పై వర్తించే నిబంధనలు తెలుసుకోడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఆఫర్లు పరిమిత కాలం వరకే ఉంటాయి. ఇంకా ఈ జువెలరీ డీల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత జువెలరీ స్టోర్లకు వెళ్లి సంప్రదించొచ్చు. ఆఫర్లు ఎప్పుడైనా మారొచ్చు.కాగా ప్రస్తుతం బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో బంగారం ధర రూ1.3 లక్షలు దాటేసింది. 24 క్యారెట్లకు ఇది వర్తిస్తుంది. పది గ్రాముల బంగారం రేటు ఇది. దీంతో బంగారం కొనాలని భావించే వారికి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అయితే రైతులు, బ్యాంకులు మాత్రం పండుగ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బంగారంపై అధిక లోన్ వస్తుంది. అలాగే బ్యాంకులకు వ్యాపారం బాగా జరుగుతోంది. కొనే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.

