గ్లింప్సె అదుర్స్ . . . .
RAPO 22 Title Glimpse రామ్ పోతినేని హిట్టు కొట్టి చాలా ఏళ్లు అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ మాస్ హిట్ తరువాత మళ్లీ ఆ రేంజ్లో సక్సెస్‌ను చూడలేకపోతోన్నాడు. ఇక స్కంధ అయితే ట్రోల్ మెటీరియల్‌గా మారింది. కానీ ఆ స్కంధకి కూడా బీ, సీ సెంటర్లలో మంచి కలెక్షన్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా రామ్ పోతినేని ఓ మూవీని ఇచ్చి చాలా ఏళ్లు అవుతోంది. అందరినీ ఒకప్పుడు ప్రేమ కథలతో నవ్వించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలుకా అని అదరగొట్టేందుకు రాబోతోన్నాడు.

