అమ్మాయిల పిచ్చోడు.. నరరూప రాక్షసుడు.. తమిళనాడును హడలెత్తించిన ‘ఆటో శంకర్’

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఎన్నో నేరాలు ప్రజలను వణికించాయి. కొందరైతే సీరియల్ కిల్లర్స్‌గా మారి తోటి మనుషులను విచక్షణ లేకుండా చంపేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మనదేశంలో ఎందరో సీరియల్ కిల్లర్స్ దశాబ్దాలు గడిచినా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తూనే ఉన్నారు.అలాంటి నేరగాళ్ల జాబితాలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి ఆటో శంకర్. అసలు పేరు గౌరీ శంకర్. ఆటో నడుపుతూ ‘ఆటో శంకర్’ అయ్యాడు. 1955లో వెల్లూరు జిల్లాలోని కాంగేయనల్లూరు గ్రామంలో జన్మించిన శంకర్.. పెరియార్‌నగర్‌లో తొలుత పెయింటర్‌గా పనిచేశాడు. 1980 దశాబ్దంలో తమిళనాడు ప్రజలకు ‘ఆటో శంకర్’ అంటే హడల్. అతడొక ఆటో డ్రైవర్, దొంగ సారా ఏజెంట్, కరడుగట్టిన క్రిమినల్, సీరియల్ కిల్లర్, స్త్రీలోలుడు, ప్రముఖులకు అమ్మాయిలను సప్లయ్ చేసే బ్రోకర్. ఇలా శంకర్‌లో ఎన్నో కోణాలున్నాయి. హత్యలు, రౌడీయిజమే మెట్లుగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న గ్యాంగ్ లీడర్. సోదరుడు మోహన్, బావమరిది ఎడిన్, శివాజీ, జయవేలు, రాజారమన్, రవి, పలనీ, పరమశివమ్‌లు ఆటోశంకర్ గ్యాంగ్‌లో సభ్యులు.

988 సంవత్సరం వేసవిలో మండే ఎండలతో అల్లాడుతున్న తమిళనాడు ప్రజలను ఓ న్యూస్ పేపర్లో వచ్చి వార్త భయాందోళనకు గురిచేసింది. ఒక్కొక్కటిగా బయటికి వచ్చిన అస్థిపంజరాలు అతడి క్రూర మనస్తత్వానికి సాక్ష్యాలుగా దర్శనమిచ్చాయి. దీంతో ‘ఆటో శంకర్’ పేరు వింటేనే ప్రజల భయంతో వణికిపోయారు. దీంతో అసలు ఎవరీ శంకర్.. ఎందుకు నేరస్థుడిగా మారాడు.. అన్న సందేహాలు అందరి మదిలోనే మెదిలింది. నల్లగా, సన్నగా, రింగుల జుట్టుతో ఉండే శంకర్‌ను చూస్తే ఎవరైనా సరే అతడు అమాయకుడనే అనుకునేవారు. కానీ చింతనిప్పుల్లాంటి అతడి కళ్ల వెనుక దాగున్న క్రూరత్వాన్ని ఎవరూ అంచనా వేసేవారు కాదు.
అప్పట్లో మద్రాసు శివార్లలో ఉండే తిరువాన్మియూరు ప్రాంతాన్ని పోలీసులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. తిరువాన్మియూరు నుంచి మహాబలిపురం దాకా సముద్ర తీరం వెంబడి వేల సంఖ్యలో తాటిచెట్లు ఉండేవి. అక్కడ కల్లు ముసుగులో నాటుసారా వ్యాపారం జోరుగా సాగేది. ఆటో డ్రైవర్ అయిన శంకర్ నాటుసారాను తన ఆటోలో సరఫరా చేసేవాడు. ఈ క్రమంలోనే అతడికి పలువురు వేశ్యలతో పరిచయాలు ఏర్పడ్డాయి. మహాబలిపురం నుంచి మద్రాసు నగరం వరకు విటులకు తన ఆటోలోనే వేశ్యలను సరఫరా చేయడం మొదలుపెట్టాడు.