
గీతను గురించి తెలుసుకో వాలన్న జిజ్ఞాసే ఎన్నో జన్మలకు గానీ కలగదంటారు.
అలాంటిది దానికన్న సత్సంగం లో మనం కలవడం గప్ప యజ్ఞం. అది ప్రారంభించే ముందు కొన్ని సూచనలు.
- ముందుగా రోజుకి కొన్ని శ్లోకాలు అన్న నియమం పెట్టుకోండి.
- పారాయణ లో కేవలం శ్లోకాలే చదవండి.
భావార్ధం పారాయణ తరువాత అదేరోజు వేరే టైమ్లో పెట్టుకోండి. కేవలం శ్లోకాలే వున్న పుస్తకం వుంచుకోండి పారాయణకు.
- ఎప్పుడైనా స్నానానంతరం చదివేలా ఒక సమయం పెట్టుకోండి.
- భగవద్గీతే దేవుడు. దానికి పూజ చేసి, సంకల్పం చెప్పుకుని, అంగన్యాస కరన్యాస పూర్వకంగా చదవండి. గీతా ప్రెస్ వారి పుస్తకాల్లో వుంటుంది.
- వీలున్నంతలో సాత్విక ఆహారాన్ని తీసుకోండి. ఆహారం మనోకోశం మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్ల తప్ప వేరే కారణం వల్ల కాదు.
- ముందుగా అ.12 (భక్తి యోగం) ని మంచిరోజు (ఏకాదశి) నాడు పూర్తిగా చదివి , తరువాత రోజు మొదటి అధ్యాయం మహాత్మ్యం చదివి నియమంగా పెట్టుకున్నన్ని శ్లోకాలు చదవండి. అలాగే ఏ అధ్యాయానికి సంబంధించి దాని మహాత్మ్యం చదివి శ్లోకాలు చదవండి
- చదివుతున్నన్ని రోజులు తక్కువ మాట్లాడుతూ, వీలున్నంతలో సాధారణంగా చేసే అనవసర కరచాలనాలు తగ్గించి మీ తేజస్సుని కాపాడుకోండి. అవతల మనిషిలోని దైవత్వానికి మీలోని దైవీగుణంతో నమస్కార ప్రతి నమస్కారం చేసుకోండి.
- మీరు తినే ఆహారం విషయంలో 5 శుద్ధులు పాటించండి.
(a) ద్రవ్య శుధ్ధి – తినే వస్తువుకై వెచ్చించిన ధనం మంచి మార్గం ద్వారా సంపాదించినదై వుండాలి.
(b) పదార్ధశుద్ధి – మీలోన వశించే పరమాత్ముడికి ఇచ్చే ఆహారం శుద్ధి చేయబడని, పవిత్ర భావంతో వండబడని, మైలబడిన, రోడ్డు పక్కన దొరికేది కాకుండా చూడండి.
(c) పాకశుద్ధి – వండేవారి మమతాను రాగం మీ మనోకోశాన్ని ప్రభావితం చేస్తుంది. పగ ద్వేషాలతో రగిలే వారి చేతి వంట కాకుండా చూసుకోండి.
(d) స్థలశుద్ధి – తినే స్థలం శుభ్రంగా అలుక బడి, పది మంది కంట బడనిదై వుండాలి. పీట మీద కూర్చుని శబ్దం రానీకుండా కడుపు నిండేలా కాక కాస్త గ్యాప్ తో లోపలున్న వైశ్వానరుడికి అర్పిస్తున్న భావంతో ఆరగించండి.
భోజనం ముందు
ఈ క్రిందిమూడుశ్లోకాలు మననం చేసుకుని ఆరగించండి.
