సీసీటీవీ కెమెరా ఇన్‌స్టాలేషన్‌లో ఉచిత శిక్షణ

శ్రీకాకుళం జిల్లా యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 13 రోజుల పాటు ఉచిత సీసీటీవీ ఇన్స్టలేషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ రోజుల్లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది. నివాసాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, గిడ్డంగులు, బట్టల షాపులు మొదలైన ప్రతి చోట సీసీటీవీ (CCTV) వ్యవస్థలు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీసీటీవీ వ్యవస్థలను అమర్చడం, నిర్వహించడం వంటి సాంకేతికతపై శిక్షణ అవసరమైంది. ఇందుకోసం ఏర్పాటు చేసే సీసీటీవీ ఇన్స్టలేషన్ శిక్షణ తరగతుల్లో వివిధ అంశాలను విద్యార్థులకు నేర్పిస్తారు. వాటి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న యువకులకు CCTV కెమెరా ఇన్స్టలేషన్లో 13 రోజుల పాటు ఉచిత శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతులు శ్రీకాకుళం జిల్లా నలుమూలల ప్రాంతం నుంచి 60 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వారు జిల్లాకు చెందిన యువకులకు 19 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగిన యువకులకు ఈ అవకాశం ఇస్తోంది. విద్యార్హత పదో తరగతి పాస్ అయి ఉన్నవారికి 13 రోజుల పాటు ఉచితంగా CCTV కెమెరా ఇన్స్టలేషన్లో ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
శిక్షణ ప్రారంభంలో సీసీటీవీ వ్యవస్థలు ఏమిటి, వాటి ఉపయోగాలు, ఎలా పనిచేస్తాయి అనే విషయాలను బోధిస్తారు. ఇందులో అనలాగ్, ఐపీ ఆధారిత కెమెరాల మధ్య తేడాలు, వాటి అనుకూలతల గురించి వివరంగా తెలియజేస్తారు. వివిధ రకాల కెమెరాలు – డోమ్ కెమెరా, బుల్లెట్ కెమెరా, పీటీజెడ్ కెమెరా, థర్మల్ కెమెరా – వాటి లక్షణాలు, ఉపయోగాలు గురించి అవగాహన కలిగిస్తారు. భద్రతా అవసరాన్ని బట్టి సరైన కెమెరా ఎంపిక చేయడం ఎలా అనేది కూడా శిక్షణ తరగతుల్లో నేర్పబడుతుంది.

